Video: ఫాలో ఆన్ గండం తప్పించిన తెలుగోడు.. తొలి హాఫ్ సెంచరీతో పుష్ప 2 సెలబ్రేషన్స్..

|

Dec 28, 2024 | 1:26 PM

Nitish Reddy Maiden Test Half Century: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో మ్యాచ్‌లో ఫాలోఆన్‌ గండాన్ని భారత్ తప్పించుకుంది. భాత జట్టు ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 288 పరుగులు చేసింది. నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లు అజేయంగా నిలిచారు. వీరిద్దరి మధ్య హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొంది. నితీష్ రెడ్డి తన టెస్టు కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.

Video: ఫాలో ఆన్ గండం తప్పించిన తెలుగోడు.. తొలి హాఫ్ సెంచరీతో పుష్ప 2 సెలబ్రేషన్స్..
Nitish Kumar Reddy Maiden Fifty
Follow us on

Nitish Reddy Maiden Test Half Century: నితీష్ కుమార్ రెడ్డి 83వ ఓవర్లో తన టెస్టు కెరీర్‌లో తొలి యాభైని పూర్తి చేశాడు. మిచెల్ స్టార్క్ వేసిన ఓవర్ మూడో బంతికి అతను ఫోర్ కొట్టాడు. దీంతో తన కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 50 పరుగులు చేసిన వెంటనే ఆస్ట్రేలియా అభిమానుల ముందు పుష్ప తరహాలో సంబరాలు చేసుకున్నాడు. దీంతో భారత అభిమానుల సందడి స్టేడియం మొత్తం ప్రతిధ్వనించింది.

ప్రస్తుతం వార్త రాసే సమయానికి భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది. నితీష్ రెడ్డి 54, వాషింగ్టన్ సుందర్ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో భారత జట్టు ఫాలో ఆన్‌ను కూడా తప్పించుకుంది.. అవసరమైన 275 పరుగులను పూర్తి చేయడంతో భారీ ప్రమాదం తప్పింది.

ఇవి కూడా చదవండి

హాఫ్ సెంచరీ భాగస్వామ్యం..

నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ మధ్య 50 పరుగుల భాగస్వామ్యం పూర్తి నెలకొంది. అంతకుముందు భారత జట్టు 221 పరుగుల వద్ద 7వ వికెట్ కోల్పోయింది.

విష్ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాన్స్, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..