వరల్డ్‌కప్ ‘ఫ్లాప్’ ప్లేయర్ బీభత్సం.. 16 బంతుల్లో అర్ధ సెంచరీ, 1 ఓవర్‌లో 5 సిక్సర్లు.. ఎవరంటే?

టీ20 ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమైన వెస్టిండీస్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ అబుదాబి టీ10 లీగ్‌లో..

వరల్డ్‌కప్ ఫ్లాప్ ప్లేయర్ బీభత్సం.. 16 బంతుల్లో అర్ధ సెంచరీ, 1 ఓవర్‌లో 5 సిక్సర్లు.. ఎవరంటే?
Gladiators Team Captain

Updated on: Dec 02, 2022 | 8:40 PM

టీ20 ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమైన వెస్టిండీస్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ అబుదాబి టీ10 లీగ్‌లో రెచ్చిపోతున్నాడు. ఈ సిరీస్‌లో తన అసాధారణమైన ఫామ్‌ను కొనసాగిస్తూ మరో హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో ఇటీవల జరిగిన 21వ మ్యాచ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్ తరపున ఆడుతున్న నికోలస్ పూరన్ కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 7 భారీ సిక్సర్లు బాదాడు. బంగ్లా టైగర్స్ కెప్టెన్ షకీబుల్ హసన్ వేసిన ఓ ఓవర్‌లో పూరన్ ఏకంగా 5 సిక్సర్లు బాదేశాడు.

ఈ మ్యాచ్‌లో బంగ్లా టైగర్స్ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని పూరన్ ప్రాతినిధ్యం వహిస్తున్న డెక్కన్ గ్లాడియేటర్స్ జట్టు కేవలం 6.1 ఓవర్లలో అంటే 37 బంతుల్లోనే చేధించి 10 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. పూరన్ 50 పరుగులు చేయగా.. అతడితో ఓపెనింగ్‌కు దిగిన టామ్-కోహ్లర్ కాడ్మోర్ 21 బంతుల్లో 50 పరుగులు చేశారు. కాగా, పూరన్ కెప్టెన్సీలోనే వెస్టిండిస్ జట్టు టీ20 ప్రపంచకప్‌ మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అటు బ్యాట్స్‌మెన్‌గా.. ఇటు కెప్టెన్‌గా పూరన్ పూర్తిగా విఫలమయ్యాడు. అలాగే ఐపీఎల్ మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ నికోలస్ పూరన్‌ను విడిచిపెట్టిన విషయం విదితమే.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..