Video: 43 బంతుల్లో 0 పరుగులు, 4 వికెట్లు.. ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ దోస్త్ ఖతర్నాక్ రికార్డ్

Bangladesh vs New Zealand 2025: న్యూజిలాండ్ ఆఫ్ స్పిన్నర్ మైఖేల్ బ్రేస్‌వెల్ బంగ్లాదేశ్‌పై అభిమానులందరినీ షాకయ్యేలా చేసి, అద్భుత రికార్డ్ నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌పై బ్రేస్‌వెల్ 4 వికెట్లు పడగొట్టాడు. అయితే, ఈమ్యాచ్‌లో విజయం సాధించి, సెమీస్ టికెట్‌ను దక్కించుకోవాలని న్యూజిలాండ్ ఆశిస్తోంది. బంగ్లా కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి, టోర్నీలో నిలదొక్కుకోవాలని కోరుకుంటోంది.

Video: 43 బంతుల్లో 0 పరుగులు, 4 వికెట్లు.. ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ దోస్త్ ఖతర్నాక్ రికార్డ్
Michael Bracewell 43 Dot Ba

Updated on: Feb 24, 2025 | 8:13 PM

Bangladesh vs New Zealand 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ జట్టు ఫామ్‌లో కనిపిస్తోంది. రావల్పిండిలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ జట్టు బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసింది. బంగ్లాదేశ్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బ న్యూజిలాండ్ ఆఫ్ స్పిన్నర్ మైఖేల్ బ్రేస్‌వెల్ కలిగించాడు. ఈ కుడిచేతి వాటం స్పిన్నర్ బంగ్లాదేశ్‌పై 10 ఓవర్లలో 26 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. బ్రేస్‌వెల్ ఎకానమీ రేటు ఓవర్‌కు కేవలం 2.6 పరుగులు మాత్రమే. కీలక విషయం ఏమిటంటే బ్రేస్‌వెల్ తన 10 ఓవర్లలో 43 బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. అంటే, అతను చాలా డాట్ బాల్స్ వేశాడు. ఇది ఒక రికార్డుగా మారింది.

బ్రేస్‌వెల్ డాట్ బాల్ రికార్డ్..

రావల్పిండిలో 43 డాట్ బాల్స్ వేసి మైఖేల్ బ్రేస్‌వెల్ తన పేరిట ఒక ప్రత్యేక రికార్డు సృష్టించాడు. అతను వన్డేలో ఇన్ని డాట్ బాల్స్ వేయడం అతని కెరీర్‌లో ఇదే తొలిసారి. ఇది అతని వన్డే కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కూడా. కివీస్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో 53, 43 డాట్ బాల్స్ బౌలింగ్ చేశాడు. అతను 2004, 2013లో ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు బ్రేస్‌వెల్ 12 సంవత్సరాల తర్వాత ఇంత గొప్ప ప్రదర్శన చేశాడు.

అద్భుతమై ఫామ్‌లో బ్రేస్‌వెల్..

మైఖేల్ బ్రేస్‌వెల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల పాకిస్తాన్‌లో జరిగిన ట్రై-సిరీస్‌లో, అతను 43 డాట్ బాల్స్ వేసి, ఆతిథ్య జట్టును కట్టడి చేశాడు. ఈ 34 ఏళ్ల ఆటగాడు చాలా కాలంగా కివీస్ జట్టుకు దూరంగా ఉన్నాడు. కానీ, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు, అతను అకస్మాత్తుగా జట్టులో స్థానం సంపాదించాడు. అతను సెలెక్టర్ల నమ్మకాన్ని కూడా గెలుచుకున్నాడు. బ్రేస్‌వెల్ వన్డే రికార్డు గురించి చెప్పాలంటే, ఈ ఆటగాడు 28 మ్యాచ్‌ల్లో 31 వికెట్లు పడగొట్టాడు. ఇది మాత్రమే కాదు, బ్రేస్‌వెల్ వన్డేల్లో 39 కంటే ఎక్కువ సగటుతో 590 పరుగులు కూడా చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..