IPL 2021: ఐపీఎల్‌ 2021 సెకండాఫ్‌కి కొత్త జోష్.. 9 మంది ప్లేయర్లు అరంగేట్రం.. వారెవరంటే?

|

Aug 27, 2021 | 9:29 AM

ఐపీఎల్ 2021 రెండవ సగం యూఏసీలో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభంకానుంది. ‎దుబాయ్, షార్జా, అబుదాబిలో మ్యాచ్‌లు జరగనున్నాయి. దీని కోసం జట్లు ఇప్పటికే సన్నద్ధమయ్యాయి.

IPL 2021: ఐపీఎల్‌ 2021 సెకండాఫ్‌కి కొత్త జోష్.. 9 మంది ప్లేయర్లు అరంగేట్రం.. వారెవరంటే?
Ipl Players
Follow us on

IPL 2021: ఐపీఎల్ 2021 రెండవ సగం ప్రారంభానికి ముందు, ఆయా జట్లు ఆటగాళ్లకు సంబంధించి పలు ప్రకటనలు చేశాయి. ఇందులో చాలా మంది స్టార్ ఆటగాళ్లు టోర్నెమెంట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితిలో వారి స్థానంలో కొత్త ఆటగాళ్లను చేర్చుకున్నాయి. దీని కింద, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. వీరంతా మొదటిసారి ఐపీఎల్‌లో ఆడేందుకు సిద్ధమయ్యారు. ఈ ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

హసరంగ..
లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగను తీసుకుంది. కరోనా కేసుల కారణంగా ఐపీఎల్ 2021 ప్రథమార్ధాన్ని జంపా మధ్యలోనే వదిలేశాడు. అలాగే సెప్టెంబర్‌లో సెకండ్ హాఫ్ నుంచి కూడా వైదొలిగాడు. అటువంటి పరిస్థితిలో, ఆర్‌సీబీ హసరంగను వెంట తీసుకెళ్లింది. ఇటీవల భారత -శ్రీలంక పర్యటనలో అతను బాగా రాణించాడు. అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా, బ్యాటింగ్‌లోనూ కీలకంగా రాణించాడు. విరాట్ కోహ్లీ జట్టు కోసం, యూఏఈ పిచ్‌లు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. వనిందు హసరంగ మొదటిసారి ఐపీఎల్‌లో ఆడనున్నాడు.

జార్జ్ గార్టెన్‌..
మరో ఆస్ట్రేలియా ఆటగాడు కేన్ రిచర్డ్సన్ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఉంది. ఐపీఎల్ 2021 రెండవ సగం నుంచి రిచర్డ్సన్ కూడా వైదొలిగాడు. అతని స్థానంలో ఇంగ్లండ్ జార్జ్ గార్టెన్‌ను తీసుకుంది. గార్టెన్ ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఇటీవలి కాలంలో ది హండ్రెడ్ అండ్ టీ 20 బ్లాస్ట్‌లో అతను బాగా బౌలింగ్ చేశాడు. ఎలాగైనా, విరాట్ కోహ్లీ తన జట్టులో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఉండాలని కోరుకుంటాడు. ఈ నేపథ్యంలో గార్టెన్ ఎంపిక మంచి నిర్ణయంగా కనిపిస్తుంది.

టిమ్ డేవిడ్‌..
న్యూజిలాండ్ యువ బ్యాట్స్‌మన్ ఫిన్ అలెన్ కూడా ఐపీఎల్ ద్వితీయార్థంలో ఆడడంలేదు. అతని స్థానంలో టిమ్ డేవిడ్‌ని ఆర్‌సీబీ భర్తీ చేసింది. డేవిడ్ ఆస్ట్రేలియన్ మూలానికి చెందిన ఆటగాడు. కానీ, సింగపూర్ కోసం ఆడుతున్నాడు. అతను సింగపూర్ నుంచి ఐపీఎల్ ఆడుతున్న మొదటి ఆటగాడు. అతను తన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లలో తనదైన ముద్ర వేశాడు. ఐపీఎల్‌లో ఈ ఆటగాడు ఎలా ఆడుతాడో చూడాలి.

దుశ్మంత చమీరా..
ఆర్‌సీబీ ద్వారా ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ డేనియల్ సామ్స్ స్థానంలో దుశ్మంత చమీరాను చేర్చారు. చమీరా ఫాస్ట్ బౌలర్. విదేశీ కోటాలో సామ్స్‌కు మంచి ప్రత్యామ్నాయంగా ఉన్నాడు. ఏదేమైనా సామ్స్ ఆర్‌సీబీలో తన సత్తా చాటలేకపోయాడు. తనకు లభించిన అవకాశాలలో రాణించలేకపోయాడు. దీంతో డానియల్ సామ్స్‌ను ఆర్‌సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడ్ ద్వారా తీసుకుంది.

తబ్రేజ్ షమ్సీ..
ఆండ్రూ టై కూడా క్రికెట్ నుండి విరామం తీసుకున్న కారణంగా ఐపీఎల్ 2021 నుంచి వైదొలిగాడు. అటువంటి పరిస్థితిలో, ఈ ఆస్ట్రేలియా ఆటగాడి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ తబ్రేజ్ షమ్సీని చేర్చింది. షమ్సీ ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ టీ 20 బౌలర్. రాజస్థాన్‌లో ప్రసిద్ధ స్పిన్నర్ లేడు. అలాగే, షమ్సీ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇది జట్టుకు చాలా ఉపయోగంగా మారుతుందని భావిస్తున్నారు.

గ్లెన్ ఫిలిప్స్‌..
జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా రాజస్థాన్ రాయల్స్ చాలా నష్టపోయింది. ఈ ఇంగ్లీష్ ప్లేయర్ స్థానంలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ గ్లెన్ ఫిలిప్స్‌ను తీసుకుంది. బ్యాటింగ్‌ను బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఫిలిప్స్ బాగా ఆడుతున్నాడు.

నాథన్ ఎల్లిస్‌..
ఈ సంవత్సరం ఐపీఎల్ 2021 కి ముందు రిలే మెరెడిత్‌ను పంజాబ్ కింగ్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. కానీ, ఈ ఆటగాడు మొదటి భాగంలో చాలా ఖరీదైన వాడిగా నిలిచాడు. ప్రస్తుతం అతను సెకండ్ హాఫ్‌లో ఆడటం లేదు. దీంతో పంజాబ్ అతని స్థానంలో నాథన్ ఎల్లిస్‌ని నియమించాడు. ఎల్లిస్ కూడా ఆస్ట్రేలియాకు చెందిన బౌలర్. అతను కొంతకాలం క్రితం బంగ్లాదేశ్‌తో టీ 20 లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించి తన సత్తా చాటాడు.

అదిల్ రషీద్‌..
ఐపీఎల్ 2021 వేలంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్‌ జ్యె రిచర్డ్సన్‌ను పంజాబ్ కింగ్స్ రూ .14 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, తను టోర్నీలో సత్తా చాటలేకపోయాడు. అతని స్థానంలో, పంజాబ్ కింగ్స్ ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్‌ను తీసుకున్నారు. టీ 20 ఫార్మాట్‌లో రషీద్ గొప్ప బౌలర్. అతను ప్రస్తుతం టీ 20 ర్యాంకింగ్స్‌లో నాల్గవ స్థానంలో ఉన్నాడు.

పాట్ కమిన్స్..
కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2021 ద్వితీయార్ధంలో పలు మార్పులు చేసింది. న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సౌథీ స్థానంలో ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ జట్టులోకి వచ్చాడు.

Also Read: హర్భజన్‌ సింగ్‌ శత్రువు రికార్డుల మోత..! వరుసగా 6 సెంచరీలు.. అంతేకాదు 6 బంతుల్లో 6 సిక్సర్లు..

చివరి బంతికి 2 పరుగులు.. ధోని క్రీజులో.. కేఎల్ రాహుల్ 46 బంతుల్లో సెంచరీ.. మామూలుగా లేదు మ్యాచ్‌..

8 నెలల్లో 6 సెంచరీలు.. రికార్డులనే భయపెట్టిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఆశ్చర్యపోతున్న టీమిండియా ప్లేయర్లు