T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన నేపాల్ టీం.. 10 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా..

Nepal T20 World Cup 2024: యూఏఈ ఇచ్చిన ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన నేపాల్ జట్టు 17.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 135 పరుగులు చేసి సులువుగా విజయం సాధించింది. నేపాల్ తరపున అసిఫ్ షేక్ అత్యధిక పరుగులు చేశాడు. అతను కూడా 51 బంతుల్లో 64 పరుగులు చేశాడు. వీరితో పాటు, గుల్సన్ ఝా 22 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ రోహిత్ పౌడెల్ 34 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి తన జట్టును విజయపథంలో నడిపించాడు.

T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన నేపాల్ టీం.. 10 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా..
Nepal Cricket Team

Updated on: Nov 03, 2023 | 8:51 PM

Nepal Cricket Team: శుక్రవారం నేపాల్‌లో జరిగిన ఆసియా క్వాలిఫయర్ ఫైనల్‌కు చేరిన తర్వాత, నేపాల్ ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024కి అర్హత సాధించింది. ఆతిథ్య జట్టు నేపాల్ క్వాలిఫయర్స్ సెమీ-ఫైనల్స్‌లో యూఏఈని 8 వికెట్ల తేడాతో ఓడించి 2024 పురుషుల టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన యూఏఈ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.

ఈ ఇన్నింగ్స్‌లో యూఏఈ తరపున 51 బంతుల్లో 64 పరుగులతో వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ అరవింద్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు కూడా బాదాడు. అతనితో పాటు, ఓపెనర్ బ్యాట్స్‌మెన్, కెప్టెన్ ముహమ్మద్ వాసిమ్ 16 బంతుల్లో 26 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు మినహా యూఏఈ బ్యాట్స్‌మెన్ ఒక్కరు కూడా 20 పరుగుల ఇన్నింగ్స్ ఆడలేకపోయారు.

సెమీస్‌లో నేపాల్ ఏకపక్షంగా విజయం..

యూఏఈ ఇచ్చిన ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన నేపాల్ జట్టు 17.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 135 పరుగులు చేసి సులువుగా విజయం సాధించింది. నేపాల్ తరపున అసిఫ్ షేక్ అత్యధిక పరుగులు చేశాడు. అతను కూడా 51 బంతుల్లో 64 పరుగులు చేశాడు. వీరితో పాటు, గుల్సన్ ఝా 22 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ రోహిత్ పౌడెల్ 34 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి తన జట్టును విజయపథంలో నడిపించాడు.

ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన నేపాల్‌కు చెందిన ఆసిఫ్ షేక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ విజయంతో, నేపాల్ వెస్టిండీస్ వర్సెస్ అమెరికాలో జరిగే టీ20 ప్రపంచ కప్ 2024కి అర్హత సాధించింది. ఇది నేపాల్ క్రికెట్‌కు భారీ విజయం. అయితే, నేపాల్ కాకుండా, ఈ టోర్నమెంట్‌లో 2024 T20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన ఏకైక జట్టుగా ఒమన్ నిలిచింది. ICC పురుషుల T20 ప్రపంచ కప్ ఆసియా ఫైనల్ 2023 మొదటి సెమీ-ఫైనల్‌లో బహ్రెయిన్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించింది. దీనికి ముందు నేపాల్ కూడా T20 ప్రపంచ కప్ 2014కి అర్హత సాధించింది. ఆ తర్వాత పదేళ్ల తర్వాత నేపాల్ జట్టు మరోసారి టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.

జట్లు:

నేపాల్ (ప్లేయింగ్ XI): రోహిత్ పౌడెల్ (కెప్టెన్), కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్ (కీపర్), దీపేంద్ర సింగ్ ఐరీ, గుల్సన్ ఝా, సోంపాల్ కమీ, కరణ్ కెసి, అబినాష్ బోహారా, బిబేక్ యాదవ్, సందీప్ లామిచానే, కుశాల్ మల్లా.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (ప్లేయింగ్ XI): ముహమ్మద్ వసీమ్(కెప్టెన్), ఖలీద్ షా, వృత్య అరవింద్(కీపర్), ఆసిఫ్ ఖాన్, అలీషన్ షరాఫు, బాసిల్ హమీద్, అలీ నసీర్, అయాన్ అఫ్జల్ ఖాన్, నీలాన్ష్ కేస్వానీ, జునైద్ సిద్ధిక్, జహూర్ ఖాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..