ZIM vs NED, WC Qualifier: వన్డే ప్రపంచ కప్ 2023 ఈ ఏడాది చివర్లో జరగనున్న సంగతి తెలిసిందే. టోర్నీ కోసం మొత్తం 8 జట్లు నేరుగా అర్హత సాధించగా.. మిగిలిన రెండు స్థానాల కోసం జింబాబ్వే వేదికగా వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో 10 జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఆతిథ్య జింబాబ్వే జట్టుతో, నెదర్లాండ్స్ టీమ్ తలపడింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకు కలిగిన ఉన్న ఎంఎస్ ధోని క్రేజ్ ఏమిటో ఈ మ్యాచ్ ద్వారా మరోసారి బహిర్గతమయింది. అవును, టోర్నీలో భారత్ లేకపోయినా కూడా టీమిండియా మాజీ కెప్టెన్ అభిమానులు క్రికెట్ మైదానంలో మెరిశారు. అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
వైరల్ అవుతోన్న ఆ ఫోటోలో ఓ అభిమాని ధోని ధరించే నెం.7 చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ పట్టుకుని కూర్చున్నాడు. విశేషం ఏమిటంటే.. చూడడానికి జింబాబ్వేకి చెందని వ్యక్తిలా ఉన్న అతను తన దేశం తరఫున మైదానంలో ఆడేవారికి కాకుండా ఎక్కడో ఉన్న ధోనిని గుర్తు చేసుకుంటూ మైదానంలో కూర్చున్నాడు. ఇంకా ధోని కానీ, ధోని టీమ్ కానీ లేని చోట కూడా అతని అభిమానులు ఉన్నారు అనడానికి ఇది తార్కాణం అని చెప్పుకోవచ్చు. ఇక ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా ధోని కోసం అభిమానులు చూసే ఎదురు చూపులు, జడేజా ఔట్ కావాలని చేసే ప్రార్థనలు, జియో సినిమాకి వచ్చే వ్యూవర్‌షిప్ రికార్డుల గురించి మనందరికీ తెలిసిందే.
MS Dhoni’s fans at Zimbabwe in the Zim vs Ned qualifiers match.
The Craze of MS Dhoni. pic.twitter.com/x4jkqeWLyL
— CricketMAN2 (@ImTanujSingh) June 20, 2023
Oh Captain, My Captain! ?#WhistlePodu #Yellove ?? @msdhoni pic.twitter.com/whJeUjWUVd
— Chennai Super Kings (@ChennaiIPL) June 13, 2023
కాగా, జింబాబ్వే , నెదర్లాండ్స్ జట్ల మధ్య మంగళవారం జరుగుతున్న మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన డచ్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఈ క్రమంలో నెదర్లాండ్స్ తరఫున ఓపెనర్లు విక్రమజిత్ సింగ్(88), మాక్స్ ఓడౌడ్(59) అర్థ సెంచరీలతో రాణించగా.. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్(83) కీలక ఇన్నింగ్స్‌తో విజృంభించాడు. ఆతిథ్య బౌలర్లలో సికిందర్ రజా 4 వికెట్లతో చెలరేగగా.. రిచర్డ్ 2 వికెట్లు తీసుకున్నాడు. భారి లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 40 ఓవర్ల ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది.
డచ్ బౌలర్లలో షరిజ్ అహ్మద్ 2, విక్రమజిత్, బాస్ డే లీడే చెరో వికెట్ తీసుకున్నారు. అంటే జింబాబ్వే విజయానికి ఇంకా 60 బంతుల్లో 12 పరుగులే అవసరం. ప్రస్తుతం క్రీజులో సికిందర్ రజా(88), రయన్ బర్ల్(15) ఉన్నారు. వీరి కంటే ముందు ఓపెనర్లుగా వచ్చిన జాయ్‌లార్డ్ గుంబీ(40), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్(50) శుభారంభం అందించారు. ఇంకా సీన్ విల్లియమ్స్ 58 బంతుల్లోనే 91 పరుగుల వద్ద ఔటైనా.. ప్రత్యర్థి బౌలర్లపై చెలరేగాడు.
మరిన్ని క్రికెట్ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..