WTC Final 2023: ఐపీఎల్ 16వ సీజన్ ముగిసిపోవడంతో ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. లండన్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అలాగే టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ రెండో సారి ఆడుతుండగా.. ఆస్ట్రేలియా తొలి సారిగా ఆడబోతుంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువరు మాజీలు డబ్య్లూటీసీ ఫైనల్ కోసం ఇరు జట్ల బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్స్‌ని ప్రకటించారు. రవిశాస్త్రీ, రికీ పాంటింగ్ వంటివారు ఈ లిస్టులో ఉన్నారు. తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుసేన్ కూడా ఇరు జట్ల నుంచి కంబైన్డ్ ప్లేయింగ్ ఎలెవన్‌ని ఎంచుకున్నాడు.
నాసిర్ ప్రకటించిన టీమ్‌కి రోహిత్ శర్మ సారథిగా ఎంపికయ్యాడు. అలాగే హిట్‌మ్యాన్ సహా భారత్ నుంచి నలుగురు మాత్రమే నాసీర్ టీమ్‌లో ఉండగా.. మిగిలినవారంత ఆస్ట్రేలియా టీమ్‌కి చెందినవారు. అయితే నాసిర్ హుసేన్ ఎంచుకున్న డబ్య్లూటీసీ ఫైనల్ ప్లేయింగ్ ఎలెవన్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు స్థానం లేకపోవడం గమనార్హం. జడేజా ఇటీవల ముగిసిన ఐపీఎల్ టోర్నీలో చెన్నైని టైటిల్ విన్నర్‌గా నిలపడంలో, అలాగే అంతకముందు జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మెరుగ్గా రాణించాడు. ఈ నేపథ్యంలో జడేజాను తన టీమ్‌లో తీసుకోకపోవడానికి కారణంగా నాసిర్ ‘టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ భారత్‌లో జరిగినట్లయితే నేను జడేజాను తీసుకునేవాడిని. కానీ మ్యాచ్ ఇంగ్లాండ్‌లో జరగనుంది కాబట్టి నేను జడేజా స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ని తీసుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు.
Nasser Hussain picks his combined 11 for WTC final.
Rohit Sharma as the captain. pic.twitter.com/gYELrdzYzw
— Johns. (@CricCrazyJohns) May 31, 2023
Nasser Hussain’s In-Aus Test XI: రోహిత్ శర్మ(కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, మహ్మద్ షమీ
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..