AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పసికూన చేతిలో ఫసక్.. ఒక్కసారి కాదు, ఏకంగా 2సార్లు ఛాంపియన్ టీం ఇజ్జత్ పాయే..!

Namibia vs South Africa: నాంబియా చేతిలో దక్షిణాఫ్రికాకు 18 పరుగుల ఓటమి ఎదురైంది. T20Iల్లో ఏకంగా సౌతాఫ్రికా జట్టుపై వరుసగా రెండో విజయం సాధించిన నాంబియా.. ట్రై సిరీస్‌ను ఘనంగా ప్రారంభించింది. దీంతో సోషల్ మీడియాలో సౌతాఫ్రికా టీంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

పసికూన చేతిలో ఫసక్.. ఒక్కసారి కాదు, ఏకంగా 2సార్లు ఛాంపియన్ టీం ఇజ్జత్ పాయే..!
Namibia Vs South Africa
Venkata Chari
|

Updated on: Aug 29, 2026 | 10:11 AM

Share

Namibia vs South Africa: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు ఊహించని పరాభవం ఎదురైంది. నాంబియా (Namibia)తో జరిగిన టీ20ఐ మ్యాచ్‌లో ప్రోటీస్ టీం 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 2026 నాంబియా టీ20ఐ ట్రై సిరీస్‌లో భాగంగా శుక్రవారం విండ్‌హోక్‌లో ఈ మ్యాచ్ జరిగింది. స్వదేశంలో నాంబియా అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికాపై టీ20ఐల్లో నాంబియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన టీ20ఐల్లో ప్రొటీస్ ఒక్కసారి కూడా గెలవకపోవడం విశేషం. తాజా ఫలితంపై క్రికెట్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

నాంబియా సంచలన విజయం..

టాస్ అనంతరం తొలుత బ్యాటింగ్ చేసిన నాంబియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ జాన్ ఫ్రైలింక్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 60 పరుగులతో జట్టు స్కోరును పోరాడే స్థాయికి తీసుకెళ్లాడు.

164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. 50 బంతుల్లో 75 పరుగులు చేసి జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు. అయితే మిగతా బ్యాటర్ల నుంచి అతడికి ఆశించిన సహకారం లభించలేదు.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: ఎవర్రా మీరు.. నో బాల్ కాదు.. వైడ్ కూడా కాదు.. కట్‌చేస్తే.. ఒకే బంతికి ఏకంగా 7 పరుగులు..!

ఫలితంగా సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులకే పరిమితమైంది. దీంతో నాంబియా 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

బౌలర్ల విజృంభణ..

నాంబియా విజయానికి బ్యాటర్లతో పాటు బౌలర్లు కీలకంగా నిలిచారు. రుబెన్ 24 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. జేజే స్మిత్ 31 పరుగులకు 3 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను కట్టడి చేశాడు.

దక్షిణాఫ్రికా జట్టులో బ్రెవిస్ మినహా పెద్దగా ఎవరూ రాణించకపోవడంతో నాంబియా బౌలర్లకు పని సులువైంది. చివరి వరకు పోరాడినా సౌతాఫ్రికా లక్ష్యానికి చేరుకోలేకపోయింది.

సీనియర్లకు విశ్రాంతి..

అయితే ఈ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగలేదు. ఆటగాళ్ల పనిభార నిర్వహణలో భాగంగా పలువురు సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతి ఇచ్చారు.

దీంతో ఎడమచేతి వాటం స్పిన్నర్ ఫార్టిన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయినప్పటికీ జట్టులో బ్రెవిస్, ప్రెటూరియస్, జోర్డాన్, టోనీ డి జోర్జి వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. అయినా నాంబియాను నిలువరించడంలో సౌతాఫ్రికా విఫలమైంది.

గతేడాది కూడా ఇదే ఫలితం..

దక్షిణాఫ్రికాపై నాంబియాకు ఇది వరుసగా రెండో టీ20ఐ విజయం. గతేడాది అక్టోబరులో విండ్‌హోక్‌లో జరిగిన ఏకైక టీ20ఐలోనూ నాంబియా సంచలన విజయం సాధించింది.

ఆ మ్యాచ్‌లో దాదాపు పూర్తి స్థాయి దక్షిణాఫ్రికా జట్టును నాంబియా నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఆ పోరులో నాంబియా విజయం అందుకుంది.

ఇప్పుడు మరోసారి అదే వేదికపై సౌతాఫ్రికాను ఓడించడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది.

అభిమానుల నుంచి భిన్న స్పందనలు..

నాంబియా విజయంతో ఆ దేశ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో సంబరాలు చేసుకున్నారు. తమ జట్టు సాధించిన అరుదైన విజయాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.

ఎక్కువమంది చదివినది: IPL 2027: ముగిసిన హార్దిక్ ట్రేడింగ్.. బలిపశువుల్లా ఆ ఇద్దరు.. ఏ టీంలో చేరనున్నాడంటే?

మరోవైపు దక్షిణాఫ్రికా అభిమానుల్లో కొందరు జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొందరు సౌతాఫ్రికాను ట్రోల్ చేస్తూ పోస్టులు పెట్టారు. ముఖ్యంగా నాంబియాపై టీ20ఐల్లో ఇప్పటివరకు విజయం సాధించలేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

నాంబియాకు కీలక ముందడుగు..

అంతర్జాతీయ క్రికెట్‌లో తమ స్థాయిని పెంచుకోవాలని నాంబియా ప్రయత్నిస్తోంది. బలమైన జట్లపై వరుస విజయాలు ఆ జట్టు ప్రయాణానికి మరింత ఊతమిస్తున్నాయి.

దక్షిణాఫ్రికాపై మరోసారి విజయం సాధించడం నాంబియాకు సాధారణ గెలుపు కంటే ఎక్కువ ప్రాధాన్యం కలిగిన ఫలితం. ట్రై సిరీస్‌ను విజయంతో ప్రారంభించిన ఆ జట్టు ఇదే జోరును కొనసాగిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us