RCB vs MI, IPL 2021: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఆదిలోనే మొదటి వికెట్‌ను కోల్పోయినా.. కెప్టెన్ కోహ్లీ(51), శ్రీకర్ భరత్(32), మ్యాక్స్‌వెల్(56) అద్భుత ఇన్నింగ్స్‌లతో ఆర్సీబీ 165 పరుగుల భారీ స్కోర్ సాధించగలిగింది. ముంబై గెలవాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 166 పరుగులు చేయాల్సి ఉంది.
విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 121 స్ట్రైక్ రేట్‌తో 3 ఫోర్లు, 3 సిక్సుల సహాయంతో అర్థ సెంచరీ సాధించాడు. 15.5 ఓవర్లో మిలాన్ బౌలింగ్‌లో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు పడిక్కల్ వికెట్‌ను త్వరగా కోల్పియిన ఆర్‌సీబీ, శ్రీకర్ భరత్ వికెట్‌ను 75 పరుగుల వద్ద కోల్పోయింది. అనంతరం మాక్స్‌వెల్ 37బంతుల్లో 151 స్ట్రైక్‌రేట్‌తో 6 ఫోర్లు, 3 సిక్సుల సహాయంతో 56 పరుగులు చేసి, నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం ఏబీడీ 11, అహ్మద్ 1 పరుగులతో నిరాశ పరిచాడు. ఇక ముంబయి బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు, బోల్ట్, మిలాన్, చాహర్ తలో వికెట్ పడగొట్టారు.
ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 28 మ్యాచులు జరిగాయి. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11, ముంబై ఇండియన్స్ 17 మ్యాచుల్లో విజయం సాధించాయి. రెండో దశలో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో ఇరు జట్లు ఘోరంగా ఓడిపోయాయి. ఇక్కడ గతంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. అయితే ఫలితం సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఇందులో ఆర్‌సీబీ విజయం సాధించింది.
Innings Break!
Sensational last two overs from @mipaltan has kept #RCB below 180. #MumbaiIndians need 166 runs to win.
Scorecard – https://t.co/KkzfsLzXUZ #RCBvMI #VIVOIPL pic.twitter.com/XOtUB2OQFp
— IndianPremierLeague (@IPL) September 26, 2021