IPL 2023: 8 కోట్లు పెట్టి మరీ ‘పేషెంట్‌’ ను కొన్నారా? ముంబై స్టార్‌ ప్లేయర్‌ ఫిట్‌నెస్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌

|

Apr 26, 2023 | 3:16 PM

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్ రూ. 8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. జోఫ్రా ఆర్చర్ సత్తా తెలిసే ముంబై ఈ మొత్తాన్ని వెచ్చించింది. అయితే ఈ ఆటగాడు ఇప్పుడు ఈ జట్టుకు భారంగా మారాడు. ముఖ్యంగా ఆర్చర్‌ పేలవమైన ఫిట్‌నెస్ ముంబైకి శాపంగా మారింది.

IPL 2023: 8 కోట్లు పెట్టి మరీ పేషెంట్‌ ను కొన్నారా? ముంబై స్టార్‌ ప్లేయర్‌ ఫిట్‌నెస్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌
Jofra Archer
Follow us on

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్ రూ. 8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. జోఫ్రా ఆర్చర్ సత్తా తెలిసే ముంబై ఈ మొత్తాన్ని వెచ్చించింది. అయితే ఈ ఆటగాడు ఇప్పుడు ఈ జట్టుకు భారంగా మారాడు. ముఖ్యంగా ఆర్చర్‌ పేలవమైన ఫిట్‌నెస్ ముంబైకి శాపంగా మారింది. ఈ స్టార్‌ బౌలర్‌ తాజా సీజన్‌లో మైదానంలో కంటే బెంచ్‌పైనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. తాజాగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అర్చర్‌ ఆడలేదు. దీంతో ముంబై  ఇండియన్స్ ఫ్యాన్స్‌ ఈ స్టార్‌ బౌలర్‌పై మండిపడుతున్నారు. ‘రూ. 8 కోట్లు పెట్టి మరీ పేషెంట్‌ను కొన్నారా?’ అంటూ సోషల్‌ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడగా.. జోఫ్రా ఆర్చర్ కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అందులోనూ ఫిట్‌నెస్‌ సమస్యలతో పెద్దగా రాణించలేకపోయాడు. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

జోప్రా ఆగ్రహం..

కాగా గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో జోఫ్రా ఇప్పుడు మళ్లీ శస్త్రచికిత్స తీసుకోనున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం ఐపీఎల్‌ మధ్యలోనే వదిలేసి బెల్జియం వెళ్లనున్నాడని టెలిగ్రాఫ్‌ ఒక కతనం ప్రచురించింది. కాగా గత 25 నెలల్లో ఆర్చర్‌కు ఇది 25వ శస్త్రచికిత్స కావడం గమనార్హం. ఇది అతని ఫిట్‌నెస్‌ ప్రమాణాలను తేటతెల్లం చేస్తుంది. ఈ సీజన్‌లో RCBతో మొదటి మ్యాచ్ ఆడిన ఈ ఫాస్ట్‌ బౌలర్‌ 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 42 పరుగులిచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. దీంతో మొత్తానికి రూ. 8 కోట్లు ఖర్చు చేసి మరీ ఈ పేషెంట్‌ను కొనుగోలు చేశారని ముంబై టీంపై ఫ్యాన్స్‌ దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా మోచేతి సర్జరీ కోసం తాను ఐపీఎల్‌ను వదిలిపెడుతున్నానని జరుగుతున్న ప్రచారంపై ముంబై పేసర్‌ స్పందించాడు. వాస్తవాలు తెలుసుకోకుండా తనపై కథనాలు ప్రచురించడం సరికాదని హితవు పలికాడు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..