
Jhye Richardson BBL: ఆస్ట్రేలియా దేశవాళీ లీగ్ బిగ్ బాష్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఝే రిచర్డ్‌సన్ తన పేస్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. టోర్నీ 20వ మ్యాచ్‌లో రిచర్డ్‌సన్ తన ఫైరింగ్ బౌలింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. మెల్‌బోర్న్ స్టార్స్ వర్సెస్ పెర్త్ స్కార్చర్స్ మధ్య మ్యాచ్‌లో రిచర్డ్‌సన్ నాలుగు వికెట్లు తీసి జట్టును గెలిపించాడు.
ఈ మ్యాచ్‌లో రిచర్డ్‌సన్ తన కోటాలో 4 ఓవర్లలో కేవలం 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో ఈ ఫాస్ట్ బౌలర్ ఎకానమీ రేటు 6.25గా నిలిచింది. రిచర్డ్‌సన్ టామ్ రోజర్స్, బ్యూ వెబ్‌స్టర్, నాథన్ కౌల్టర్-నైల్, ల్యూక్ వుడ్‌లకు పెవిలియన్ మార్గం చూపించాడు. ఈ సమయంలో రిచర్డ్‌సన్‌కు హ్యాట్రిక్ సాధించే సువర్ణావకాశం కూడా వచ్చింది. కానీ, అతను అలా చేయలేకపోయాడు. అయితే ఈ హ్యాట్రిక్ బాల్‌లో రిచర్డ్‌సన్ గంటకు 150.5 కిలోమీటర్ల వేగాన్ని అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు.
బీబీఎల్‌లో ఇప్పటివరకు రిచర్డ్‌సన్ 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ సమయంలో అతను మొత్తం 12 వికెట్లు పడగొట్టాడు. అతను ఇప్పటివరకు టోర్నమెంట్‌లో రెండవ అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. ఇటీవల సిడ్నీ సిక్సర్స్‌పై 4 ఓవర్లలో కేవలం 9 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం గమనార్హం. రిచర్డ్‌సన్ బౌలింగ్ తీరు రోజురోజుకూ మెరుగవుతోందనేందుకు ఈ లెక్కలే చక్కని ఊదాహరణలు.
150.5kph for the hat-trick attempt ??
Jhye Richardson is PUMPED!! #BBL12 | #ohwhatafeeling | @Toyota_Aus pic.twitter.com/AmzUeLoxwR
— cricket.com.au (@cricketcomau) December 29, 2022
ఐపీఎల్ మినీ వేలం 2023లో పేసర్ రిచర్డ్‌సన్‌ను ముంబై ఇండియన్స్ అతని బేస్ ధర అంటే రూ. 1.50 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలో ఫ్రాంచైజీలు ఏవీ రిచర్డ్‌సన్‌పై ఆసక్తి చూపలేదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ముంబై టీం.. తమ జట్టులో ఒక అద్భుతమైన ఆటగాడిని చేర్చుకుంది. ఇప్పుడు టోర్నమెంట్‌లో J,J,J,J అంటే జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, ఝై రిచర్డ్‌సన్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ జోడీ చెలరేగుతుందని టీం మేనేజ్‌మెంట్ ఆశిస్తుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..