ఐపీఎల్ క్రికెట్‌లో ‘ఎల్ క్లాసికో’గా పరిగణించే ‘చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్’ మ్యాచ్ ఈ రోజు అంటే శనివారం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై తరఫున ఆ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ(0) తన ఖాతా తెరవలేకపోయాడు. మూడు బంతులు ఎదుర్కొని కూడా డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ చెత్త రికార్డు సృష్టించాడు.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా రోహిత్ శర్మతో పాటు సునీల్ నరైన్(కోల్‌కతానైట్ రైడర్స్), మన్‌దీప్ సింగ్(కోల్‌కతానైట్ రైడర్స్), దినేష్ కార్తీక్(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) కూడా 15 డకౌట్‌లతో ఉన్నారు. కానీ ఈ మ్యాచ్‌లో దీపక్ చాహర్ వేసిన బంతికి రోహిత్ ఖాతా తెరవకుండానే క్యాచ్ ఔట్ అవడం ద్వారా 16వ సారి డకౌట్ అయ్యాడు. ఇలా ఐపీఎల్ చరిత్రలో 16 సార్లు డకౌట్ అయిన రోహిత్ అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా అవతరించాడు.
Rohit Sharma registers his 16th duck in IPL history – The most by any batter in the league.
?: Jio Cinema pic.twitter.com/60WKNXABrX
— CricTracker (@Cricketracker) May 6, 2023
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా రెండో సారి జరుగుతున్న ‘చెన్నై టీమ్ vs ముంబై టీమ్’ మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్ శర్మ మరో రికార్డును కూడా తిరగరాశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన కెప్టెన్‌గా గౌతమ్ గంభీర్ పేరిట ఉన్న రికార్డును కూడా రోహిత్ శర్మ తన సొంతం చేసుకున్నాడు. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ కెప్టెన్‌గా వ్యవహరించిన గంభీర్ 10 డకౌట్‌లతో అత్యధిక సార్లు డకౌట్ అయిన సారధిగా చెత్త రికార్డును కలిగి ఉన్నాడు. కానీ నేటి మ్యాచ్‌లో కెప్టెన్‌గా 11వ సారి డకౌట్ అయిన రోహిత్ ఆ రికార్డును తిరగరాసి తన పేరిట లిఖించుకున్నాడు.
Most ducks as captain in the IPL:
11 – Rohit Sharma
10 – Gautam Gambhir#IPL2023— CricTracker (@Cricketracker) May 6, 2023
కాగా, చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఈ రోజు జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఈ క్రమంలో ముంబై తరఫున నేహల్ వధేరా(64) అర్థశతకంతో రాణించగా, సూర్య కుమార్ యాదవ్(26), ట్రిస్టన్ స్టబ్స్(20) పర్వాలేదనిపించారు. ఇక మిగిలినవారిలో ఏ ఒక్కరూ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. అలాగే చెన్నై బౌలర్లలో పతిరాణా 3 వికెట్లు తీసుకోగా, దీపక్ చాహార్, దేశ్‌పాండే చెరో 2, జడేజా ఒక వికెట్ తీసుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..