Rohit Sharma Birthday: నేడు హిట్‌మ్యాన్‌ పుట్టినరోజు.. ఐపీఎల్‌లో అతడి ప్రదర్శనపై పెద్ద చర్చ..!

Rohit Sharma Birthday: నేడు టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పుట్టిన రోజు. ఐపీఎల్‌లో భాగంగా ఇప్పుడు అతను ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా

Rohit Sharma Birthday: నేడు హిట్‌మ్యాన్‌ పుట్టినరోజు.. ఐపీఎల్‌లో అతడి ప్రదర్శనపై పెద్ద చర్చ..!
Rohit Sharma

Updated on: Apr 30, 2022 | 7:59 AM

Rohit Sharma Birthday: నేడు టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పుట్టిన రోజు. ఐపీఎల్‌లో భాగంగా ఇప్పుడు అతను ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తు్న్నాడు. గతంలో అతని ఆధ్వర్యంలో ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా అవతరించింది. కానీ ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో జట్టు పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. దీంతో రోహిత్‌ పరిస్థితి కూడా అధ్వానంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.

నేను టాలెంటెడ్‌ని కాదు: రోహిత్‌

రోహిత్ ప్రతిభావంతుడు. అతడికి దేవుడు మంచి బ్యాటింగ్ నైపుణ్యాలను బహుమతిగా ఇచ్చాడు. అయితే ప్రజల్లో ఉన్న ఈ అభిప్రాయంతో రోహిత్ ఏకీభవించడం లేదు. ఈ విషయం గురించి 2015 సెప్టెంబర్‌లో డీఎన్‌ఏకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. “నేను ప్రతిభావంతుడనని నేను అనుకోను. నిజానికి నేను బ్యాట్స్‌మెన్‌ని కూడా కాదు. నేను బౌలర్‌ని. అక్కడి నుంచే కెరీర్‌ ప్రారంభించాను. ఈ సహజ ప్రతిభ అనేది మీడియా సృష్టించినదే” అన్నాడు. అయితే ఈ ప్రకటన ఏడు సంవత్సరాల క్రితం చేసినది. అయితే ఈ ప్రకటన చేసినప్పటి నుంచి రోహిత్ శర్మ గ్రాఫ్ తీవ్రంగా పడిపోయింది.

ఒక లెక్క ప్రకారం ఇప్పటి వరకు 2019 సంవత్సరపు చెత్త బ్యాట్స్‌మెన్‌ల జాబితాను పరిశీలిస్తే.. రోహిత్ అనే చెబుతారు. 2019 నుంచి మొదటి మూడు స్థానాల్లో కనీసం 30 ఇన్నింగ్స్‌లు ఆడిన 15 మంది బ్యాట్స్‌మెన్‌లలో ఇద్దరు మాత్రమే 30 సగటును కలిగి ఉన్నారు. ఈ 15 మందిలో ఐదుగురు మాత్రమే 130 కంటే తక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశారు. ఈ రెండు జాబితాల్లోనూ రోహిత్ చోటు దక్కించుకున్నాడు. గత సీజన్లలో రోహిత్ ఫ్లాప్ షో లేకపోయినా జట్టు విజయం సాధించింది. ఈ సీజన్‌లో వ్యవహారం పూర్తిగా మారిపోయింది. ఐపీఎల్ 15వ సీజన్ రెండో దశకు చేరుకున్నప్పటికీ ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఒక్క మ్యాచ్ గెలవలేదు. 35వ పుట్టినరోజునైనా విజయంతో జరుపుకోవాలని అందరు కోరుకుంటున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

Woman Health: ప్రతి మహిళకి 5 వైద్య పరీక్షలు తప్పనిసరి.. లేదంటే ఈ అనారోగ్య సమస్యలు..!

Kiwi Fruit: కివీ పండులో పోషకాలు పుష్కలం.. ఇలా ట్రై చేయండి..!

Viral Video: చిరుతపులి చెట్టు దిగే పద్దతి చూసి షాక్‌ అవుతున్న నెటిజన్లు..!