IPL 2023: ముంబై ఫ్యాన్స్‌కు భారీ షాక్.. సీజన్ నుంచి తప్పుకున్న స్టార్ బౌలర్..

|

May 09, 2023 | 4:06 PM

Jofra Archer: ఈరోజు (మే 9) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనున్న ముంబై ఇండియన్స్ (MI)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు లీడ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ IPL 2023కి దూరమయ్యాడు. అతను తన పునరావాసంపై దృష్టి పెట్టడానికి ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్తున్నాడు.

IPL 2023: ముంబై ఫ్యాన్స్‌కు భారీ షాక్.. సీజన్ నుంచి తప్పుకున్న స్టార్ బౌలర్..
Chris Replaces Jofra Archer
Follow us on

Jofra Archer Ruled Out: ఈరోజు (మే 9) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనున్న ముంబై ఇండియన్స్ (MI)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు లీడ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ IPL 2023కి దూరమయ్యాడు. అతను తన పునరావాసంపై దృష్టి పెట్టడానికి ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్తున్నాడు. జోఫ్రా ఆర్చర్ స్థానంలో ఇంగ్లిష్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ జోర్డాన్ ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు.

జోఫ్రా ఆర్చర్ 2021 సంవత్సరం ప్రారంభం నుంచి గాయాలతో ఇబ్బందులు పడుతున్నాడు. గత 26 నెలల్లో ఆయన 6 సార్లు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. గాయం, శస్త్రచికిత్స నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆర్చర్ ఇప్పుడు ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లనున్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు ముంబై ఇండియన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘మిగిలిన సీజన్‌లో క్రిస్ జోర్డాన్ ముంబై ఇండియన్స్‌లో చేరాడు. జోఫ్రా ఆర్చర్ స్థానంలో అతడిని జట్టులోకి తీసుకున్నాం. జోఫ్రా ఆర్చర్ ఫిట్‌నెస్‌పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఓ కన్నేసి ఉంచింది. అతను ఇప్పుడు తన పునరావాసంపై దృష్టి పెట్టడానికి ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్తున్నాడు’ అంటూ అందులో పేర్కొంది.

IPL 2023 మధ్యలో ఒక చిన్న సర్జరీ కూడా..

జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. తొలి మ్యాచ్ తర్వాతే అతను నాలుగు మ్యాచ్‌ల విరామం తీసుకోవలసి వచ్చింది. నిజానికి, మొదటి మ్యాచ్‌లో బౌలింగ్ సమయంలో, అతనికి కుడి మోచేయికి దెబ్బ తగిలింది. దాంతో చిన్న శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. ఈ సర్జరీ బెల్జియంలో జరిగింది. ఆ తరువాత, ఆర్చర్ IPL 2023లో మళ్లీ తిరిగి వచ్చాడు. 5 మ్యాచ్‌లలో నాలుగు ఆడాడు.

ఈ 5 మ్యాచ్‌ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ సమయంలో అతను ఓవర్‌కు 9.5 పరుగుల ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు. అతను 145 కి.మీ. వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..