IPL 2023: ‘మనల్ని ఎవడ్రా ఆపేది’.. టీమిండియా ఫ్యూచర్ సూపర్‌స్టార్ ఆ ప్లేయరే.. నయా ధోని దొరికేశాడోచ్.!
లాస్ట్ ఓవర్‌లో చేధించాల్సిన లక్ష్యం ఎంతైనా పర్లేదు.. క్రీజులో రింకూ ఉన్నాడంటే.. విజయం మనదే అని ధీమా వ్యక్తం చేస్తోంది కేకేఆర్. మొన్న గుజరాత్ టైటాన్స్‌పై..
రింకూ.. రింకూ.. రింకూ.. ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా.. ఇదే పేరు మారుమ్రోగుతోంది. ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్ రింకూ సింగ్ ప్రతీ మ్యాచ్‌కు తన క్రేజ్ పెంచుకుంటూపోతున్నాడు. లాస్ట్ ఓవర్‌లో చేధించాల్సిన లక్ష్యం ఎంతైనా పర్లేదు.. క్రీజులో రింకూ ఉన్నాడంటే.. విజయం మనదే అని ధీమా వ్యక్తం చేస్తోంది కేకేఆర్. మొన్న గుజరాత్ టైటాన్స్‌పై చివరి ఓవర్‌లో 5 సిక్సర్లతో కోల్‌కతాకు అద్భుత విజయాన్ని అందించిన రింకూ సింగ్.. మరోసారి అలాంటి ప్రదర్శనతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు.
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ కేకేఆర్ ఫినిషర్ మరోసారి తన బ్యాట్‌తో సత్తా చాటాడు. స్లో వికెట్‌పై చివరి వరకు క్రీజులో నిలిచి.. 10 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఆర్షదీప్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా.. లాస్ట్ బాల్‌కి ఫోర్ కొట్టి కేకేఆర్‌ను గెలిపించాడు. దీంతో అతడి సహచర టీమ్‌మేట్స్ మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా రింకూ సింగ్‌పై ప్రశంసలు కురిపించారు. టీమిండియాకు ఫ్యూచర్ సూపర్‌స్టార్ రింకూ అని.. నయా ధోని దొరికేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, ఇదే సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఆఖరి ఓవర్‌లో చివరి 5 బంతులకు 5 సిక్సర్లు బాదేసి.. కేకేఆర్ జట్టుకు రింకూ సింగ్ సూపర్ విక్టరీని అందించిన విషయం తెలిసిందే. కోల్‌కతాలో ఆండ్రీ రస్సెల్ లాంటి హార్డ్ హిట్టర్ ఉండగా.. ఆ జట్టు రింకూ సింగ్‌పైనే నమ్మకం ఉంచింది. సూపర్ ఫినిషర్‌గా తన జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అటు వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. రింకూ సింగ్‌కు ఛాన్స్ రావచ్చు.
Rinku da giving us celebration goals! ??#KKRvPBKS | #AmiKKR | @rinkusingh235 pic.twitter.com/15zmPDZu9x
— KolkataKnightRiders (@KKRiders) May 9, 2023
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..