టీ20ల్లో ముంబై ఇండియన్స్ రికార్డ్!

ఐపీఎల్‌ 2019లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్-ముంబై ఇండియన్స్ మధ్య వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో బరికి దిగడం ద్వారా ముంబై ఇండియన్స్ జట్టు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 200 టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి జట్టుగా ముంబై సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 199 మ్యాచ్‌లు ఆడిన ముంబై 112 విజయాలు అందుకుంది. నేటి మ్యాచ్‌లో గెలిస్తే మరో విజయం జట్టు ఖాతాలో చేరుతుంది. […]

టీ20ల్లో ముంబై ఇండియన్స్ రికార్డ్!

Edited By:

Updated on: Apr 13, 2019 | 9:48 PM

ఐపీఎల్‌ 2019లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్-ముంబై ఇండియన్స్ మధ్య వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో బరికి దిగడం ద్వారా ముంబై ఇండియన్స్ జట్టు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 200 టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి జట్టుగా ముంబై సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 199 మ్యాచ్‌లు ఆడిన ముంబై 112 విజయాలు అందుకుంది. నేటి మ్యాచ్‌లో గెలిస్తే మరో విజయం జట్టు ఖాతాలో చేరుతుంది. ఇప్పటి వరకు ఇంగ్లిష్ జట్లు సోమర్‌సెట్, హ్యాంప్‌షైర్ జట్లు మాత్రమే 190కి పైగా టీ20లు ఆడాయి. సోమర్‌సెట్ 199 మ్యాచ్‌లు ఆడగా, హ్యాంప్‌షైర్ 194 మ్యాచ్‌లు ఆడి ముంబై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.