బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ధోని సహచరుడు.. వరల్డ్ కప్ ఆడినా మారని తలరాత.. పూర్తి వివరాలివే..

Suraj Randiv: టీమిండిమా మాజీ కెప్టెన్ ధోనితో కలిసి ఆడిన ఓ క్రికెటర్ ‌ఇప్పుడు బస్ డ్రైవర్‌గా మారాడు. సాధారణంగా రిటైర్ అయిన క్రికెటర్లు కాెమంటేటర్‌గా, కోచ్ లేదా అడ్మినిస్ట్రేటర్‌ వంటి పదవుల్లో క్రికెట్‌కి దగ్గరగానే ఉంటారు. అయితే రిటైర్‌మెంట్ తర్వాత..

బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ధోని సహచరుడు.. వరల్డ్ కప్ ఆడినా మారని తలరాత.. పూర్తి వివరాలివే..
Suraj Randiv

Updated on: Jun 19, 2023 | 9:17 PM

Suraj Randiv: టీమిండిమా మాజీ కెప్టెన్ ధోనితో కలిసి ఆడిన ఓ క్రికెటర్ ‌ఇప్పుడు బస్ డ్రైవర్‌గా మారాడు. సాధారణంగా రిటైర్ అయిన క్రికెటర్లు కామంటేటర్‌గా, కోచ్ లేదా అడ్మినిస్ట్రేటర్‌ వంటి పదవుల్లో క్రికెట్‌కి దగ్గరగానే ఉంటారు. అయితే రిటైర్‌మెంట్ తర్వాత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న క్రికెటర్లు కూడా లేకపోలేదు. ఇదే కోవకు చెందుతాడు శ్రీలంక మాజీ ప్లేయర్ సూరజ్ రందీవ్. దేశం తరఫున వరల్డ్ కప్ ఆడిన ఈ ప్లేయర్.. రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత ఆస్ట్రేలియాలో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు.

రందీవ్ ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్. కెప్టెన్ ధోనితో కలిసి కూడా ఆడాడు. అంతేనా.. 2011 వరల్డ్ కప్ ట్రోఫీ కోసం భారత్‌తో తలపడిన శ్రీలంక టీమ్‌లో రందీవ్ కూడా సభ్యుడు. ఆ మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసిన రందీవ్ 43 పరుగులే ఇచ్చాడు. రందీవ్ 2009లో టీమిండియాపై స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ స్థానంలో లంక తరఫున అరంగేట్రం చేశాడు. 2009 నుంచి 2016 వరకు జాతీయ జట్టు కోసం ఆడిన రందీవ్.. రిటైర్‌మెంట్ తర్వాత మెల్‌బోర్న్‌లోని ట్రాన్స్‌దేవ్ కంపెనీ బస్సు డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. విచారకరం ఏమిటంటే.. అదే కంపెనీలో మాజీ క్రికెటర్లు వాడింగ్టన్ మవైంగా(జింబాబ్వే), చింతక జయసింగ్(శ్రీలంక) కూడా ఉన్నారు.

కాగా, శ్రీలంక తరఫున 12 టెస్టులు ఆడిన రందీవ్ 147 పరుగులు చేయడంతో పాటు 43 వికెట్లు పడగొట్టాడు. అలాగే 31 వన్డేలు ఆడి 280 పరుగులు చేసి, 36 వికెట్లు తీసుకున్నాడు. 2010 నుంచి లంక తరఫున టీ20 ఆడిన రందీవ్ 7 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీశాడు. ఇంకా ధోనితో కలిసి చెన్నై తరఫున 8 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు తీశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..