MS Dhoni New Look : హాలీవుడ్ స్టార్ హీరోలను తలదన్నేలా.. ధోనీ న్యూ లుక్.. ఎంత బాగున్నాడో
క్రికెట్ అభిమానులందరికీ గుడ్ న్యూస్. ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2026లో ఆడటం ఖాయమైంది. ఆయన ఇంతకు ముందే ఈ విషయాన్ని ధృవీకరించినప్పటికీ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్షన్ లిస్ట్ కూడా వచ్చేసింది. సీఎస్‌కే రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ధోనీతో సహా 17 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది.

MS Dhoni New Look : క్రికెట్ అభిమానులందరికీ గుడ్ న్యూస్. ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2026లో ఆడటం ఖాయమైంది. ఆయన ఇంతకు ముందే ఈ విషయాన్ని ధృవీకరించినప్పటికీ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్షన్ లిస్ట్ కూడా వచ్చేసింది. సీఎస్‌కే రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ధోనీతో సహా 17 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ముఖ్యంగా ట్రేడ్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్ సంజు శాంసన్‌ను కూడా తమ స్క్వాడ్‌లోకి తీసుకుంది. ఈ వార్తల మధ్య ఎంఎస్ ధోనీ ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. అక్కడ ఆయన లుక్ చూస్తే హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోడు.
ఎయిర్‌పోర్ట్‌లో ధోనీ చాలా డ్యాషింగ్‌గా కనిపించారు. ఆయన లేత గోధుమ రంగు హాఫ్ స్లీవ్ టీ-షర్ట్ ధరించి, దానికి తోడు నల్లటి కళ్లద్దాలు పెట్టుకున్నారు. ఈ కాంబినేషన్‌లో ఆయన లుక్ చాలా స్టైలిష్‌గా ఉంది. ఆయన నల్లటి బ్యాగ్ కూడా చాలా స్టైలిష్‌గా ఉండగా, అక్కడి నుంచి వెళ్తూ కెమెరాలకు చూసి బై కూడా చెప్పారు.
సంజు శాంసన్‌ను సీఎస్‌కేలోకి తీసుకోవడం చూసి, ధోనీ అభిమానులు ఒక కొత్త ఊహలో ఉన్నారు. వేలానికి ముందే సీఎస్‌కే సంజు శాంసన్‌ను ట్రేడ్ ద్వారా తమ జట్టులోకి తీసుకుంది. సంజు శాంసన్ ఇంతకు ముందు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. సంజు బదులుగా సీఎస్‌కే నుంచి రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లు వచ్చే సీజన్‌లో రాజస్థాన్ తరపున ఆడతారు.
సంజు శాంసన్‌ను ధోనీకి వారసుడిగా భావిస్తున్నారు. అందుకే రాబోయే సీజన్ ధోనీకి చివరి ఐపీఎల్ అయ్యే అవకాశం ఉండటంతో సీఎస్‌కే భవిష్యత్తు కెప్టెన్‌గా సంజును చూసే అవకాశం ఉంది. దీనిని బట్టి చూస్తే సంజు శాంసన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకుని, ఎంఎస్ ధోనీ కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ చేయడానికి వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఊహిస్తున్నారు.
ఐపీఎల్ 2026 కోసం చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, ఎం.ఎస్. ధోనీ, శివం దూబే. సంజు శాంసన్ ట్రేడ్ చేసుకున్నారు.మిగిలిన ప్లేయర్లు డెవాల్డ్ బ్రెవిస్, ఆయుష్ మ్హాత్రే, ఉర్విల్ పటేల్, జైమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, గుర్జపనీత్ సింగ్, నైథన్ ఎల్లిస్, శ్రేయాస్ గోపాల్, ముఖేష్ చౌదరి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




