MS Dhoni: అదిదా ధోని..! ఒంటిచేత్తో సిక్స్.. ఆపై 11 బంతుల్లో బడితపూజ.. వేట ఇలానే ఉంటది

లక్నోపై గెలవడానికి CSK 30 బంతుల్లో 55 పరుగులు అవసరమైనప్పుడు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత, ధోని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో మ్యాచ్ వేగంగా పూర్తయింది. ధోని కేవలం 11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌తో 26 పరుగులు చేసి నాటౌట్‌‌‌‌‌‌గా నిలిచాడు. ఆ వివరాలు

MS Dhoni: అదిదా ధోని..! ఒంటిచేత్తో సిక్స్.. ఆపై 11 బంతుల్లో బడితపూజ.. వేట ఇలానే ఉంటది
Ms Dhoni

Updated on: Apr 15, 2025 | 5:33 PM

ఐపీఎల్ 2025 30వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తమ ఓటముల పరంపరను బ్రేక్ వేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే 19.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయంలో చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ విన్నింగ్ నాక్‌తో తన జట్టుకు విజయాన్ని అందించాడు. అతడికి శివమ్ దూబే అండగా నిలవడంతో ఇద్దరూ కలిసి సునాయాసంగా టార్గెట్‌ చేధించారు.

కేవలం 11 బంతుల్లోనే ధోని మ్యాచ్ గమనాన్ని మార్చాడు. జట్టు గెలవడానికి 30 బంతుల్లో 55 పరుగులు అవసరమైనప్పుడు CSK కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రీజులోకి వచ్చాడు. అతడు కేవలం 11 బంతుల్లోనే 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ధోని ఒక చేత్తో సిక్స్ కొట్టడమే కాదు.. ఇంపాక్ట్ ప్లేయర్ శివమ్ దూబేతో కలిసి 27 బంతుల్లో 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మరోవైపు శివమ్ దూబే 37 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆడిన 7 మ్యాచ్‌ల్లో CSKకి ఇది రెండో విజయం కాగా.. నెట్ రన్‌రేట్ పేలవంగా ఉండటంతో విజయం సాధించినప్పటికీ.. చివరి స్థానంలో నిలిచాడు. అటు పాయింట్ల పట్టికలో LSG జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ధోనీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నాడు. 26 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో పాటు.. ఒక క్యాచ్, ఒక స్టంపింగ్, ఒక రనౌట్ చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ 20వ ఓవర్ మొదటి బంతికి అబ్దుల్ సమద్‌ను.. ధోని అద్భుతంగా అవుట్ చేశాడు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..