ధోని ఆటను సీరియస్‌గా తీసుకుంటాడు.. నమ్మకానికే మొదటి ప్రాధాన్యత.. అందుకే కొనసాగిస్తామంటున్న..

|

Mar 13, 2021 | 8:25 PM

MS Dhoni Takes His Cricket so Seriously : టీమిండియా మాజీ ప్లేయర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి సీఎస్‌కే

ధోని ఆటను సీరియస్‌గా తీసుకుంటాడు.. నమ్మకానికే మొదటి ప్రాధాన్యత.. అందుకే కొనసాగిస్తామంటున్న..
Ms Dhoni Takes His Cricket
Follow us on

MS Dhoni Takes His Cricket so Seriously : టీమిండియా మాజీ ప్లేయర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి సీఎస్‌కే యజమాని ఎన్. శ్రీనివాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ జట్టులో నమ్మకానికే అధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. అందుకే ధోని వీడ్కోలు పలికినప్పటికీ సారథిగా కొనసాగిస్తున్నామని వివరించారు. ఎంస్ ధోని ఆటను సీరియస్‌గా తీసుకుంటాడని, విజయాలను అందించాలన్న కసి అతడిలో కనిపిస్తుందని కొనియాడాడు. అందుకే అతడు ప్రపంచ క్రికెట్‌లో ఉత్తమ కెప్టెన్‌గా నిలిచాడన్నారు.

గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై పేలవంగా ఆడిందని, తొలిసారి ప్లేఆఫ్స్‌కు వెళ్లకుండా వెనుదిరిగిందని గుర్తుచేశారు. జట్టులో సమతూకం కొరవడింది. సీనియర్లు కొందరు సీజన్లో పాల్గొనలేదు. జూనియర్లకు మొదట్లో అవకాశాలు ఇవ్వలేదు. దాంతో జట్టు ఎక్కువగా ఓటమి పాలైందని బదులిచ్చారు. ఈ సారి జరిగిన ఐపీల్‌ వేలంలో మొయిన్‌ అలీ (రూ.7 కోట్లు), కృష్ణప్ప గౌతమ్‌ (రూ.9.25 కోట్లు)ను భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక సురేశ్‌ రైనా తిరిగి జట్టులో చేరాడు. రాబిన్‌ ఉతప్పను రాజస్థాన్‌ నుంచి బదిలీ చేసుకున్నారు.

క్రికెట్‌లో నమ్మకం, అంకిత భావం, నిలకడలే ఆటగాడిని ఎల్లప్పుడు కాపాడుతాయని చెప్పారు. కొన్నేళ్లుగా తాము క్రికెట్‌కి సేవ చేస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘దాదాపుగా 50 ఏళ్ల నుంచి మేం క్రికెట్లో ఉన్నాం. 1960 నుంచి తమిళనాడు క్రికెటర్లు మొత్తం మా వద్ద ఉద్యోగులే. అందుకే మేం సుదీర్ఘ కాలంగా క్రికెట్లో ఉన్నాం. జట్లను నడుపుతున్నామని పేర్కొన్నారు. ‘ఎంఎస్‌ ధోనీ ప్రస్తుతం చెన్నైలో ఉన్నాడని.. ఉదయం ఇండోర్లో, సాయంత్రం చెపాక్‌లో సాధన చేస్తున్నాడని వెల్లడించాడు.

Health Tips: ఉదయం పూట ఖాళీ కడుపుతో ఈ పదార్థాలు అస్సలు తినకూడదట.. తింటే ప్రమాదమేనంటున్నారు నిపుణులు..!

మైనర్‌తో పెళ్లి చేయాలని యువకుడు హల్‌చల్‌.. పోలీస్ స్టేషన్‌లోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..

Mahashivaratri: ఈ శివాలయం ప్రత్యేకతే వేరు.. అగ్నిగుండంలో ఆ రెండూ వేస్తే కోరిన కోరికలు తీరుతాయట..