‘సహకరించని పిచ్’… రోహిత్ క్లీన్ చిట్!

| Edited By: Pardhasaradhi Peri

Jul 01, 2019 | 5:56 PM

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలై ప్రపంచకప్‌లో తొలి పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ధోనీ-జాధవ్‌ల భాగస్వామ్యం మరోసారి చర్చనీయాంశమైంది. ఆఖరి ఓవర్లలో సాధించాల్సిన పరుగులు ఎక్కువగా ఉన్నప్పటికీ వీరు కనీసం పోరాడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరి ఐదు ఓవర్లలో 71 పరుగులు అవసరం కాగా ఈ జోడి 39 పరుగులే చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్‌ అనంతరం వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ […]

సహకరించని పిచ్... రోహిత్ క్లీన్ చిట్!
Follow us on

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలై ప్రపంచకప్‌లో తొలి పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ధోనీ-జాధవ్‌ల భాగస్వామ్యం మరోసారి చర్చనీయాంశమైంది. ఆఖరి ఓవర్లలో సాధించాల్సిన పరుగులు ఎక్కువగా ఉన్నప్పటికీ వీరు కనీసం పోరాడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరి ఐదు ఓవర్లలో 71 పరుగులు అవసరం కాగా ఈ జోడి 39 పరుగులే చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

మ్యాచ్‌ అనంతరం వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ మాట్లాడుతూ ధోనీ-జాధవ్‌ల జోడీ బౌండరీలు బాదేందుకు ప్రయత్నించిందని, పిచ్‌ నెమ్మదించడంతో అది సాధ్యంకాలేదని తెలిపాడు. మరోవైపు ఇంగ్లాండ్‌ బౌలర్లు సరైన ప్రణాళికతో బంతులేశారని.. మొత్తంగా ఆతిథ్య జట్టు పరిస్థితులను సద్వినియోగం చేసుకుందని కితాబిచ్చాడు. అలాగే హార్దిక్ పాండ్య సైతం బాగా ఆడాడని, దురదృష్టవశాత్తూ అతడు భారీ స్కోర్‌ సాధించలేకపోయాడని స్పష్టంచేశాడు.ఈ సందర్భంగా కెప్టెన్‌ కోహ్లీ సైతం మహీని వెనకేసుకొచ్చాడు. ధోనీ ధాటిగా ఆడుతూ బౌండరీలు సాధించేందుకు ప్రయ్నతించాడని చెప్పాడు.