భారత జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఆతిథ్య జట్టుతో 3 T20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడాల్సి ఉంది. అయితే తొలి మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. భారీ వర్షం కారణంగా తొలి మ్యాచ్‌లో టాస్ కూడా పడలేదు. ఇప్పుడు అందరి దృష్టి ఆదివారం (నవంబర్ 20) జరిగే రెండో గేమ్‌పైనే ఉంది. 2022 టీ20 ప్రపంచకప్‌లో రెండు జట్లూ సెమీఫైనల్‌లోనే ఇంటి బాట పట్టాయి. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోగా, న్యూజిలాండ్‌ను పాకిస్థాన్ ఓడించింది. ఈ ఓటమి తర్వాత, యువ ఆటగాళ్లతో భారత జట్టు న్యూజిలాండ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతుండగా కివీస్ జట్టు మాత్రం అనుభవజ్ఞులైన ఆటగాళ్లతోనే రంగంలోకి దిగనుంది. కాగా ఈ టూర్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లకు విశ్రాంతినిచ్చారు. చాలా మంది యువ ఆటగాళ్లు తమ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నారు. హార్ధిక్ కెప్టెన్సీతో పాటు శుభ్‌మన్ గిల్ టీ20 అరంగేట్రం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ప్రపంచకప్‌లో ఘోర పరాజయం తర్వాత టీ20 జట్టులో భారీ మార్పులు చేయాలని బీసీసీఐ పరిశీలిస్తోంది. మరోవైపు సెలక్షన్ కమిటీని కూడా బోర్డు రద్దు చేసింది. త్వరలో కొత్త సెలక్షన్ బోర్డు ఎంపిక జరగనుంది. దీంతో భారత క్రికెట్‌లో కూడా పెనుమార్పు వచ్చే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో తమకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని యువ ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. కాగా మౌంట్ మౌంగనుయ్‌లోని బే ఓవల్‌లో జరిగే ఈ మ్యాచ్‌పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. వర్షం కారణంగా ఈ మ్యాచ్ కూడా సాధ్యపడే అవకాశం లేదని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ సమయానికి (భారతకాలమానం ప్రకారంమధ్యాహ్నం 12 గంటలకు) ఆకాశం పూర్తిగా మేఘావృతం అయ్యి ఉంటుందని, 90 శాతం వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వెదర్ ఫోర్‌కాస్ట్‌లో పేర్కొంది. అయితే వాతావరణంలో అనూహ్య మార్పులు జరిగితే మాత్రం కొద్ది ఓవర్లతో ఆటను నిర్వహించే అవకాశాలున్నాయని తెలిపింది.
హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్/చహల్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్/మహ్మద్ సిరాజ్.
? ? Snapshots from #TeamIndia‘s traditional welcome at Mt. Maunganui
Image Courtesy: Jamie Troughton/Dscribe Media#NZvIND pic.twitter.com/K4yUiScPO7
— BCCI (@BCCI) November 19, 2022
— BCCI (@BCCI) November 19, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..