T20 WC 2022: టీ20 ప్రపంచ కప్ 2022లో హీరోలు వీరే.. టాప్ స్కోరర్ నుంచి బెస్ట్ ఇన్నింగ్స్ వరకు.. పూర్తి జాబితా ఇదే..

|

Oct 29, 2022 | 1:57 PM

T20 World Cup 2022 Top Stats: టీ20 ప్రపంచ కప్ 2022లో మొత్తం 45 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కాగా, ఇప్పటి వరకు 26 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. రికార్డుల పరంగా ఎవరు ముందున్నారో ఓసారి చూద్దాం..

T20 WC 2022: టీ20 ప్రపంచ కప్ 2022లో హీరోలు వీరే.. టాప్ స్కోరర్ నుంచి బెస్ట్ ఇన్నింగ్స్ వరకు.. పూర్తి జాబితా ఇదే..
T20 World Cup 2022 Records
Follow us on

T20 ప్రపంచ కప్ 2022 లో సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్‌ల తర్వాత శ్రీలంక ఓపెనర్ కుశాల్ మెండిస్ పరుగుల పరంగా అగ్రస్థానంలో ఉన్నాడు. అదే సమయంలో వికెట్లు తీయడంలో నెదర్లాండ్స్ బౌలర్ బాస్ డి లీడే ముందంజలో ఉన్నాడు. అయితే, శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్ ఆటగాళ్లు ఈ గణాంకాలలో అగ్రస్థానంలో ఉండటానికి పెద్ద కారణం కూడా ఉంది. ఈ జట్లు ఇతర జట్ల కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాయని గుర్తించుకోవాలి. సూపర్-12లోని ఇతర జట్ల కంటే శ్రీలంక, నెదర్లాండ్స్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లు క్వాలిఫయర్స్‌లోనూ ఆడడం వల్ల రికార్డుల్లో ముందున్నాయి. టీ20 ప్రపంచ కప్ 2022 సూపర్ 12లో ఆడుతోన్న జట్ల కంటే ఈ జట్లు 3 మ్యాచ్‌లు ఎక్కువగా ఆడాయి.

ఇప్పటి వరకు టీ20 ప్రపంచ కప్‌లో నమోదైన రికార్డులు ఇవే..

1. అత్యధిక స్కోరు: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

2. అతిపెద్ద విజయం: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

3. అత్యధిక పరుగులు: శ్రీలంక ఓపెనర్ కుశాల్ మెండిస్ 5 ఇన్నింగ్స్‌ల్లో 176 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 44, స్ట్రైక్ రేట్ 157.14గా నిలిచింది.

4. అత్యుత్తమ ఇన్నింగ్స్: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికాకు చెందిన రిలే రోసో 109 పరుగులు చేశాడు.

5. అత్యధిక సిక్సర్లు: రిలే రోస్సో ఇప్పటివరకు 8 సిక్సర్లు కొట్టాడు.

6. అత్యధిక వికెట్లు: నెదర్లాండ్స్ బౌలర్ బాస్ డి లీడ్ 5 ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు తీశాడు. అతని బౌలింగ్ సగటు 14.44, ఎకానమీ రేటు 8.66గా నిలిచింది.

7. ఉత్తమ బౌలింగ్: ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ సామ్ కరణ్ 3.4 ఓవర్లలో 10 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

8. బెస్ట్ వికెట్ కీపింగ్: ఇంగ్లండ్‌కు చెందిన జోస్ బట్లర్ వికెట్ వెనుక 5 వికెట్లు పడగొట్టాడు.

9. అత్యధిక భాగస్వామ్యం: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికాకు చెందిన రిలే రోస్సో, క్వింటన్ డి కాక్ 168 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.

10. అత్యధిక క్యాచ్‌లు: ఐరిష్ ఆటగాడు మార్క్ ఈడర్ 5 మ్యాచ్‌ల్లో 4 క్యాచ్‌లు పట్టాడు.

11. తొలి సెంచరీ: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా బ్యాటర్ రిలే రోసో 109 పరుగులు చేశాడు. దీంతో ఈ టోర్నీలో తొలి సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.