IPL 2022: ఈ ఆరుగురు ఆటగాళ్లు అత్యధిక ధర పలికారు.. కానీ ప్రదర్శన ఎలా ఉందంటే..?

|

May 31, 2022 | 6:15 AM

IPL 2022: ఐపీఎల్‌ 2022 భిన్నంగా ఏమి లేదు. ఈ సీజన్‌కు ముందు వేలంలో చాలా మంది ఆటగాళ్లు 10 కోట్లకు పైగా సంపాదించారు. వారిలో చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన దీపక్

IPL 2022: ఈ ఆరుగురు ఆటగాళ్లు అత్యధిక ధర పలికారు.. కానీ ప్రదర్శన ఎలా ఉందంటే..?
Most Expensive Players
Follow us on

IPL 2022: ఐపీఎల్‌ 2022 భిన్నంగా ఏమి లేదు. ఈ సీజన్‌కు ముందు వేలంలో చాలా మంది ఆటగాళ్లు 10 కోట్లకు పైగా సంపాదించారు. వారిలో చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన దీపక్ చాహర్‌ని 14 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే అతను గాయం కారణంగా దూరంగా ఉన్నాడు. కాబట్టి అతడిని మినహాయించి అత్యధిక ధర కలిగిన టాప్ 6 ప్లేయర్‌ల ఆటతీరుని ఒక్కసారి పరిశీలిద్దాం.

1. ఇషాన్ కిషన్: ఈసారి మెగా వేలంలో యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ అయిన ఇషాన్ కిషన్‌పై అత్యధిక మొత్తం వెచ్చించారు. ముంబై ఇండియన్స్ రికార్డు స్థాయిలో రూ.15.25 కోట్లు వెచ్చించింది. అయితే ఇషాన్ పర్ఫార్మెన్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. అతను 14 ఇన్నింగ్స్‌లలో 418 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ 120 మాత్రమే. ఆరంభంలో అతను సరిగ్గా రాణించలేకపోయాడు. దీని ఫలితం ముంబైపై కనిపించింది.

2. శ్రేయాస్ అయ్యర్: ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్‌ను కోల్‌కతా రూ. 12.25 కోట్లకు కొనుగోలు చేసి ఊహించినట్లుగా కెప్టెన్‌గా చేసింది. శ్రేయాస్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. 14 మ్యాచ్‌లలో 134 స్ట్రైక్ రేట్, 3 హాఫ్ సెంచరీలతో 401 పరుగులు చేశాడు. అయితే అతనికి మిగతా బ్యాట్స్‌మెన్‌ల నుంచి సరైన మద్దతు లభించలేదు. అలాగే జట్టును ప్లేఆఫ్‌కు తీసుకెళ్లలేకపోయాడు.

ఇవి కూడా చదవండి

3. లియామ్ లివింగ్ స్టన్ : ఈ మెగా వేలంలో అత్యధికంగా అమ్ముడైన విదేశీ ఆటగాడిగా ఇంగ్లండ్ కు చెందిన లివింగ్ స్టన్ నిలిచాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.11.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ 14 మ్యాచ్‌లలో 437 పరుగులు చేశాడు. అందులో అతని స్ట్రైక్ రేట్ 182. అతడు 34 సిక్సర్లు కొట్టాడు. అందులో ఒకటి 117 మీటర్ల దూరం చేరుకుంది.

4. నికోలస్ పూరన్: వెస్టిండీస్ దూకుడు బ్యాట్స్‌మెన్ పూరన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతడు మంచి ప్రదర్శన చేశాడు. పూరన్ 144 స్ట్రైక్ రేట్‌తో 13 ఇన్నింగ్స్‌ల్లో 306 పరుగులు చేశాడు. అయితే చాలా మ్యాచ్‌ల్లో జట్టు బాధ్యత చివరికి అతనిపైనే పడింది.

5. శార్దూల్ ఠాకూర్: ఢిల్లీ క్యాపిటల్స్ భారత ఆల్‌రౌండర్‌ను రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ డీల్ పెద్దగా విజయం సాధించలేకపోయింది. శార్దూల్ 14 ఇన్నింగ్స్‌లలో 138 స్ట్రైక్ రేట్‌తో 120 పరుగులు చేశాడు. అయితే అతను 15 వికెట్లు సాధించాడు. అతని ఎకానమీ రేటు 9.78.

6. వనిందు హసరంగా, హర్షల్ పటేల్: ఆర్సీబీ హసరంగా, హర్షల్ కోసం రూ. 10.75 కోట్ల చొప్పున ఖర్చు చేసింది. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా లెగ్ స్పిన్నర్ హసరంగ నిలిచాడు. 26 వికెట్లు తీశాడు. అయితే బ్యాట్‌తో అద్భుతాలు చేయలేకపోయాడు. మరోవైపు హర్షల్ పటేల్ మునుపటి సీజన్‌ మాదిరి విజయం సాధించలేకపోయాడు. అయినప్పటికీ 19 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి