Ratan Tata: ఆ చిరస్మరణ విజయంలో రతన్ టాటా కీలకపాత్ర.. భారత క్రికెట్‌కు ఏం చేశారంటే?

Ratan Tata and cricket: భారత్‌లోకి క్రికెట్ వచ్చి ఏళ్లు గడిచినా, 1983లో దేశంలో వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాతనే దాని ప్రజాదరణ పెరిగింది. కపిల్ దేవ్ నాయకత్వంలో టీమ్ ఇండియా అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఆశ్చర్యకరంగా, టీమ్ ఇండియా ఈ చిరస్మరణీయ తొలి ప్రపంచ కప్ విజయంలో రతన్ టాటా సహకారం ముఖ్యమైనది.

Ratan Tata: ఆ చిరస్మరణ విజయంలో రతన్ టాటా కీలకపాత్ర.. భారత క్రికెట్‌కు ఏం చేశారంటే?
Ratan Tata And Cricket
Follow us
Venkata Chari

|

Updated on: Oct 10, 2024 | 6:11 PM

Ratan Tata and Cricket: ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) బుధవారం అర్థరాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రతన్ టాటా.. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. కానీ చికిత్స ప్రభావవంతంగా లేకపోవడంతో రతన్ టాటా.. ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాడు. మధ్యతరగతి ప్రజల నాడి బాగా తెలిసిన టాటా.. తన నిస్వార్థ సేవ ద్వారా పరిశ్రమలోనే కాకుండా వివిధ రంగాలలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచానికి పెద్దన్నగా వెలుగొందుతున్న భారత క్రికెట్‌కు టాటా అందించిన సహకారం ఎంతో ఉంది.

భారత్‌లోకి క్రికెట్ వచ్చి ఏళ్లు గడిచినా, 1983 వన్డే ప్రపంచకప్ విజయం తర్వాతే దేశంలో ఆదరణ పెరిగింది. కపిల్ దేవ్ నాయకత్వంలో టీమ్ ఇండియా అనూహ్యమైన ఘనతను సాధించింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, టీమిండియా చిరస్మరణీయమైన తొలి ప్రపంచకప్ విజయంలో రతన్ టాటా సహకారం ముఖ్యమైనది. టాటా యాజమాన్యంలోని కంపెనీల సహాయంతో క్రికెట్‌లో నైపుణ్యం సాధించిన స్టార్ ప్లేయర్లు 1983 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియాకు విశేషమైన ప్రదర్శన ఇచ్చారు. వారిలో ప్రముఖులు మొహిందర్ అమర్‌నాథ్, రవిశాస్త్రి, సందీప్ పాటిల్.

1983 ప్రపంచ కప్ హీరోలకు టాటా ఎయిడ్..

నిజానికి, 1983 ప్రపంచకప్‌కు ముందు మొహిందర్ అమర్‌నాథ్ టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా తరపున, సందీప్ పాటిల్ టాటా ఆయిల్ మిల్స్ తరపున, రవిశాస్త్రి టాటా స్టీల్ తరపున ఆడారు. ఆ విధంగా ముగ్గురు ఆటగాళ్లు టాటా-మద్దతుగల దేశీయ జట్లతో తమ కెరీర్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో రతన్ టాటా టాటా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. టాటా మద్దతుతో భారతదేశంలో క్రికెట్ ప్రజాదరణ పొందింది.

టాటా సహకారంతో ఎదిగిన క్రికెటర్లు వీరే..

భారత క్రికెట్‌కు టాటా అందించిన సహకారం దీనికే పరిమితం కాదు. ఈ ముగ్గురు క్రికెటర్లతో పాటు ఫరూక్ ఇంజనీర్ (టాటా మోటార్స్), జవగల్ శ్రీనాథ్ (ఇండియన్ ఎయిర్‌లైన్స్), సంజయ్ మంజ్రేకర్ (ఎయిర్ ఇండియా), కిరణ్ మోర్ (టిఎస్‌సి), రుసీ సూర్తి (ఐహెచ్‌సిఎల్), సందీప్ పాటిల్, వీవీవిఎస్ లక్ష్మణ్ (ఇండియన్ ఎయిర్‌లైన్స్), యువరాజ్ సింగ్ (ఇండియన్ ఎయిర్‌లైన్స్), హర్భజన్ సింగ్ (ఇండియన్ ఎయిర్‌లైన్స్), సురేష్ రైనా (ఎయిర్ ఇండియా), రాబిన్ ఉతప్ప (ఎయిర్ ఇండియా), మహ్మద్ కైఫ్ (ఇండియన్ ఎయిర్‌లైన్స్), నిఖిల్ చోప్రా (ఇండియన్ ఎయిర్‌లైన్స్), ఇర్ఫాన్ పఠాన్ (ఎయిర్ ఇండియా), ఆర్.పి. సింగ్ (టాటా గ్రూప్) టాటా యాజమాన్యంలోని సంస్థలతో కలిసి పని చేయడం ద్వారా క్రికెట్‌లో కూడా తనదైన ముద్ర వేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!