Video: ప్రధాని మోదీ కాల్‌ చేశారు..! ఆసక్తికర విషయం వెల్లడించిన సిరాజ్‌

భారత క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి ఆటగాళ్లను ఓదార్చిన విషయాన్ని వెల్లడించాడు. ఆయన మాటలు ఎంతో ప్రేరణనిచ్చాయని, తరువాతి విజయాలకు ప్రధాని మోదీ మద్దతు ఉత్సాహాన్ని పెంచిందని సిరాజ్ తెలిపాడు.

Video: ప్రధాని మోదీ కాల్‌ చేశారు..! ఆసక్తికర విషయం వెల్లడించిన సిరాజ్‌
Mohammed Siraj Pm Modi

Updated on: Sep 16, 2025 | 11:06 PM

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, మన హైదరాబాదీ కుర్రాడు మొహమ్మద్‌ సిరాజ్‌ ప్రస్తుతం రెస్ట్‌లో ఉన్నాడు. ఆసియా కప్‌ 2025 టోర్నీకి ఎంపిక చేయకుండా సిరాజ్‌కు భారత సెలెక్టర్లు రెస్ట్‌ ఇచ్చారు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో అద్భుతంగా రాణించిన తర్వాత సిరాజ్‌కు కాస్త బ్రేక్‌ లభించింది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిరాజ్‌, ప్రధాని మోదీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

2023 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో జరిగిన విషయం గురించి సిరాజ్‌ స్పందించాడు. ఆ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఓడిపోయిన తర్వాత టీమిండియా ఆటగాళ్లంతా ఎంతో బాధలో ఉన్నారు. ఆ సమయంలో ప్రధాని మోదీ నేరుగా టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వచ్చేశారు. వచ్చి బాధలో ఉన్న టీమిండియా ఆటగాళ్లను ఓదార్చారు. ఈ ఘటన గురించి సిరాజ్‌ మాట్లాడుతూ.. ‘2023లో ప్రపంచ కప్ ఫైనల్‌ ఓటమి తర్వాత మోదీ గారు డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి ఆయన మాటలతో మాలో ఉత్సాహాన్ని నింపారు. ఒక సంవత్సరం తర్వాత మేం టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచినప్పుడు, ఆయన మమ్మల్ని అభినందించడానికి ఫోన్ చేశారు. ఓటమిలో అలాగే విజయంలో ఆయన మాకు తోడుగా నిలిచారు. నిజంగా అది ప్రేరణ ఇచ్చే విషయం’ అంటూ సిరాజ్‌ అన్నాడు.

నిజానికి 2023 వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఎంతో అద్భుతంగా ఆడింది. ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా ఫైనల్‌ వరకు దూసుకెళ్లింది. కానీ, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. అయితే దెబ్బ తిన్న పులిలా వెంటనే ఆ ఓటమి బాధ నుంచి తేరుకొని.. వరుసగా రెండు సంవత్సరాల్లో రెండు కప్పులు కొట్టింది. 2024లో టీ20 వరల్డ్‌ కప్‌, అలాగే ఈ ఏడాది 2025లో ఛాంపియన్స్‌ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి