మహ్మద్ షమీ భారత జట్టుకు తన ప్రాబల్యాన్ని మరోసారి ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమీపిస్తుండగా, షమీ తన ఫిట్‌నెస్, ప్రదర్శనతో సెలెక్టర్లకు గట్టి సందేశం పంపారు. గాయాల కారణంగా 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన షమీ, తాజాగా దేశవాళీ క్రికెట్‌లో సత్తా చూపుతూ జట్టులో తిరిగి స్థానం కోసం పావులు కదుపుతున్నారు.
తాజాగా షమీ తన శిక్షణ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోలో, బెంగాల్ జట్టుతో కలిసి విజయ్ హజారే ట్రోఫీ కోసం చెమటలు చిందిస్తూ కనిపించారు. గతంలో గాయాల గురించి ఆందోళనలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం జరుగుతున్న ట్రోఫీ మ్యాచ్‌లలో ఆయన మేలైన బౌలింగ్ చేసి, జట్టుకు తన ప్రాముఖ్యతను చాటుకున్నారు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 11 వికెట్లు సాధించిన షమీ, విజయ్ హజారే ట్రోఫీలోనూ తన ఫిట్‌నెస్, ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగులతో సత్తా చాటడం ద్వారా తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని కూడా నిరూపించారు. ఇది అతడిని నమ్మకమైన ఆల్‌రౌండర్‌గా నిలిపే అవకాశాన్ని పెంచింది.
34 ఏళ్ల మహ్మద్ షమీ, 2023 ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్. ఇప్పుడు, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సెలక్షన్ కమిటీకి ఆయనను జట్టులోకి తీసుకోవడం ఓ అనివార్య నిర్ణయంగా మారుతోంది. జనవరి 12న భారత జట్టు ప్రకటించబడతుందని భావిస్తున్న తరుణంలో, షమీ తన ప్రదర్శనతో సెలెక్టర్లకు నిరూపణ చేస్తున్నాడు.
Precision, Pace, and Passion, All Set to Take on the World! 🌍💪 #Shami #TeamIndia pic.twitter.com/gIEfJidChX
— 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) January 7, 2025