వన్డే ప్రపంచకప్ ముగిసిపోయింది. అక్టోబర్ 5న ప్రారంభమైన ఈ మెగా క్రికెట్ టోర్నీ నవంబర్ 19న ముగిసింది. ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వ విజేతగా నిలిచింది. నవంబర్ అంతటా క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించింది వన్డే ప్రపంచ కప్. ఈ నేపథ్యంలో నవంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు నామినేషన్స్‌ను ప్రకటించింది. మొత్తం ముగ్గురు ఆటగాళ్లను ఈ పురస్కారానికి నామినేట్ చేసింది. ఇందులో ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు ఆటగాళ్ల పేర్లతో పాటు టీమిండియా ఆటగాడి పేరు కూడా చేర్చారు. భారత ఆటగాడు మహ్మద్ షమీతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్‌వెల్ కూడా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో నిలిచారు. ప్రపంచకప్ సెమీఫైనల్స్, ఫైనల్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ట్రావిస్ హెడ్.. తన జట్టును ప్రపంచ ఛాంపియన్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు. వరల్డ్ కప్ సెమీ-ఫైనల్స్, ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు హెడ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. సెమీ-ఫైనల్‌లో హెన్రిక్ క్లాసెన్, మార్కో జాన్సన్‌ల వికెట్లు పడగొట్టడంతో పాటు 48 పరుగుల వద్ద 62 పరుగులు చేసి ఆసీస్‌ను గెలిపించాడు. ఇక టీమిండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 120 బంతుల్లో 137 పరుగులు చేసి ఆస్ట్రేలియాను విశ్వ విజేతగా నిలిపాడు. 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తడబడింది. అయితే హెడ్ 15 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది జట్టును చాంపియన్‌గా నిలిపాడు.
ఇక ఐసీసీ నామినేట్ చేసిన రెండో ఆటగాడు ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్.ప్రపంచకప్‌లో ఆఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 201 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఇక భారత్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌లో అతను 207.14 స్ట్రైక్ రేట్‌తో 116 పరుగులు చేశాడు. భారత ఆటగాడు మహ్మద్ షమీని కూడా ఐసీసీ నామినేట్ చేసింది. ప్రపంచకప్‌లో మహమ్మద్ షమీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. 2023 క్రికెట్ ప్రపంచ కప్‌లో, అతను కేవలం ఏడు ఇన్నింగ్స్‌లలో 24 వికెట్లు తీసి టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకపై 18 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు. మరి ఈ ముగ్గురిలో ఎవరు ఈ ఐసీసీ టైటిల్‌ను గెలుచుకుంటారో చూడాలి.
Two World Cup winners from Australia and an in-form Indian seamer headline the ICC Men’s Player of the Month Award for November 2023 💥
Who gets your vote? 🤔https://t.co/EHWp83PUO5
— ICC (@ICC) December 8, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..