Mohammed Shami: ‘1000 సార్లు జై శ్రీరామ్ అన్నా తప్పేముంది.. నేను ఇండియన్‌ ముస్లిం’: మహ్మద్ షమీ

స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ ను ఫైనల్‌ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ. అయితే ఆ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షమీ.. అయోధ్య రామ మందిరంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఒక మ్యాచ్‌ లో షమీని చూసి అభిమానులు జై శ్రీరామ్‌ నినాదాలు చేయడంపైనా రియాక్ట్‌ అయ్యాడు

Mohammed Shami: 1000 సార్లు  జై శ్రీరామ్ అన్నా  తప్పేముంది.. నేను ఇండియన్‌ ముస్లిం: మహ్మద్ షమీ
Mohammed Shami

Updated on: Feb 09, 2024 | 3:39 PM

స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ ను ఫైనల్‌ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ. అయితే ఆ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షమీ.. అయోధ్య రామ మందిరంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఒక మ్యాచ్‌ లో షమీని చూసి అభిమానులు జై శ్రీరామ్‌ నినాదాలు చేయడంపైనా రియాక్ట్‌ అయ్యాడు. అందులో తప్పేముందంటూ తన మత సామరస్యాన్ని చాటుకున్నాడు. ‘ప్రతి మతంలోనూ ఓ ఐదు, పది మంది అవతలి మతం వాళ్లంటే ఇష్టపడరు. అందులో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయోధ్యలో రామ మందిరాన్ని కట్టినప్పుడు జై శ్రీరామ్ అనడంలో సమస్య ఏముంది. దానిని వెయ్యిసార్లు చెప్పనివ్వండి. ఒకవేళ నేనూ అల్లాహు అక్బర్ నినాదాలు చేయాలనుకుంటే వెయ్యిసార్లు చేస్తాను. అందులో తప్పేముంది. ఓ ముస్లిం, అందులోనూ ఓ ఇండియన్‌ అయినందుకు నేను చాలా గర్వపడతాను’ అని షమీ తన మత సామరస్యాన్ని చాటుకున్నాడు.

ఇక గతేడాది జరిగిన వరల్డ్ కప్ లో శ్రీలంకతో మ్యాచ్ లో రజితను ఔట్ చేసిన తర్వాత షమి మోకాళ్లపై కూర్చున్నాడు. దీంతో అతడు నమాజ్ చేయబోయాడన్న విమర్శలు వచ్చాయి. అయితే తాను భారత దేశంలో ఉన్నడన్న సంగతి గుర్తుకు వచ్చి ఆగిపోయాడని పాకిస్తాన్‌ మీడియా కథనాలు గుప్పించింది. దీనిపై మరోసారి స్పందించాడు షమీ. ‘ మ్యాచ్‌ లో నేను సజ్దా చేయబోయానని అంటున్నారు. కానీ నేను అలా చేయలేదు. కొందరు నా దేశం గురించి, మరికొందరు నా మతం గురించి మాట్లాడారు. ఆ సమయంలో నా బౌలింగ్ ను ప్రశంసించకుండా ఈ వివాదాన్ని మాత్రం హైలెట్‌ చేశారు . నేను అప్పటికే వరుసగా ఐదో ఓవర్ వేశాను. అలసటతో మోకాళ్లపై కూర్చుండిపోయాను. నేనో ముస్లిం. అలాగే నేను ఇండియన్ ను కూడా. నాకు నా దేశమే తొలి ప్రాధాన్యత’ అని చెప్పుకొచ్చాడు షమీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మహ్మద్ షమీ కామెంట్స్ వైరల్.. వీడియో

 

కూతురితో షమీ..

బీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవంలో స్టార్ పేసర్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..