T20 World Cup: బుమ్రా స్థానంలో ఆడేది అతనే.. ఆస్ట్రేలియా ఫ్లైట్‌ ఎక్కనున్న హైదరాబాదీ పేసర్‌.. బీసీసీఐ కీలక ప్రకటన

|

Oct 14, 2022 | 6:02 PM

గాయం కారణంగా బుమ్రా మెగా ఈవెంట్‌కు దూరమైనందున షమీకి ప్రధాన జట్టులో చోటు దక్కింది. అతనితో పాటు మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ జట్టుకు బ్యాకప్ ప్లేయర్‌లుగా ఎంపికయ్యారు. త్వరలో ఈ ఇద్దరు కూడా ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు.

T20 World Cup: బుమ్రా స్థానంలో ఆడేది అతనే.. ఆస్ట్రేలియా ఫ్లైట్‌ ఎక్కనున్న హైదరాబాదీ పేసర్‌.. బీసీసీఐ కీలక ప్రకటన
Indian Cricket Team
Follow us on

గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీని జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐఅధికారిక ప్రకటన విడుదల చేసింది. గతంలో షమీని టీ20 వరల్డ్‌కప్‌లో స్టాండ్‌బై ప్లేయర్ల జాబితాలో చేర్చారు. అయితే గాయం కారణంగా బుమ్రా మెగా ఈవెంట్‌కు దూరమైనందున షమీకి ప్రధాన జట్టులో చోటు దక్కింది. అతనితో పాటు మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ జట్టుకు బ్యాకప్ ప్లేయర్‌లుగా ఎంపికయ్యారు. త్వరలో ఈ ఇద్దరు కూడా ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. గతంలో బుమ్రా స్థానంలో దీపక్ చాహర్ కూడా రేసులో ఉన్నాడు. కానీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు దీపక్ గాయపడ్డాడు. దీంతో అతను కూడా ఆసీస్‌ ఫ్లైట్‌ మిస్ అయ్యాడు. కాగా షమీ ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌ల ప్రారంభానికి ముందు బ్రిస్బేన్‌లో షమీ జట్టుతో చేరతాడని కూడా బీసీసీఐ తెలిపింది.

అనుభవానికే ప్రాధాన్యం..

కాగా భారత ఫాస్ట్ బౌలింగ్ లైనప్‌లో ఇప్పుడు షమీ, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు. కాగా గతంలో, పలువురు మాజీ క్రికెటర్లు, దిలీప్ వెంగ్‌సర్కార్, కృష్ణమాచారి శ్రీకాంత్‌తో సహా బీసీసీఐ మాజీ సెలక్టర్లు షమీని జట్టులోకి తీసుకోవాలని బోర్డుకు సూచించారు. ఐపీఎల్ 2022 ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న షమీ 16 మ్యాచ్‌ల్లో 18.30 స్ట్రైక్ రేట్‌తో 20 వికెట్లు తీశాడు. కాగా మహ్మద్ షమీని ఎంచుకోవడానికి ఆస్ట్రేలియాలో అతని అనుభవమే ప్రధాన కారణం. షమీ ఆస్ట్రేలియాలో 8 టెస్టులు, 14 వన్డేలు ఆడాడు. అయితే అతను అక్కడ ఒక్క టీ20 మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఇక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో షమీ రికార్డు పెద్దగా ఏమీ లేదు. 17 టీ20 మ్యాచుల్లో 18 వికెట్లు తీశాడు. ఎకానమీ రేటు ఓవర్‌కు 9.54 పరుగులు.

ఇవి కూడా చదవండి

టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్ . అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..