AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooyavanshi : ఐపీఎల్ దోస్తీ వేరు.. ఇంటర్నేషనల్ క్రికెట్ వేరు.. వైభవ్‌కు మాజీ క్రికెటర్ వార్నింగ్

Vaibhav Sooyavanshi : ఇంగ్లాండ్‌తో ఐదో టీ20కు ముందు యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి మాజీ క్రికెటర్ మొయిన్ అలీ కీలక హెచ్చరిక చేశాడు. ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ పూర్తిగా వేరని, జోఫ్రా ఆర్చర్ వంటి బౌలర్లను తక్కువ అంచనా వేయొద్దని సూచించాడు.

Vaibhav Sooyavanshi  :  ఐపీఎల్ దోస్తీ వేరు.. ఇంటర్నేషనల్ క్రికెట్ వేరు..  వైభవ్‌కు మాజీ క్రికెటర్  వార్నింగ్
Vaibhav Sooyavanshi
Rakesh
|

Updated on: Jul 11, 2026 | 2:47 PM

Share

Vaibhav Sooyavanshi : భారత క్రికెట్ జట్టుకు ఇంగ్లాండ్ పర్యటన అస్సలు కలిసిరావడం లేదు. ఇప్పటికే ఇంగ్లాండ్ చేతిలో టీ20 సిరీస్‌ను కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ సేన.. ఇప్పుడు పరువు కాపాడుకునేందుకు ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. నేడు జరగబోయే ఐదో టీ20 మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి క్లీన్ స్వీప్ అవమానం నుంచి తప్పించుకోవడమే కాకుండా, ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని కాపాడుకోవాల్సిన భారీ ఒత్తిడి భారత బ్యాటర్లపై ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లోనూ భారత్ ఓడిపోతే, అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ కిరీటాన్ని టీమిండియా కోల్పోవాల్సి వస్తుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ ఇప్పటికే వరుసగా ఐదు మ్యాచ్‌లు, రెండు సిరీస్‌లు ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

ఈ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ముఖ్యమైన అంశం.. భారత 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ, ఇంగ్లాండ్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ మధ్య మైదానంలో జరుగుతున్న పోరు. వీరిద్దరూ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున కలిసి ఆడారు. ఐపీఎల్ క్యాంప్‌లో నెట్ ప్రాక్టీస్ సమయంలో ఆర్చర్ బౌలింగ్‌ను వైభవ్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడని, అతనిపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడనే వార్తలు ఉన్నాయి. అయితే, ఐదో టీ20కి ముందు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మొయిన్ అలీ ఈ యువ ఆటగాడిని హెచ్చరించాడు. ఐపీఎల్ నెట్స్ వేరు, ఇంటర్నేషనల్ క్రికెట్ వేరని.. అంతర్జాతీయ వేదికపై ఆర్చర్ లాంటి బౌలర్లను తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వైభవ్‌కు సూచించాడు.

బియర్డ్ బిఫోర్ వికెట్ అనే పాడ్‌కాస్ట్‌లో మొయిన్ అలీ మాట్లాడుతూ.. “వైభవ్ సూర్యవంశీ లాంటి యువ ఆటగాడిని అవుట్ చేయడానికి జోఫ్రా ఆర్చర్ అంతర్జాతీయ మ్యాచ్‌లో బౌన్సర్లతో విరుచుకుపడటం నాకు బాగా నచ్చింది. ఐపీఎల్ సమయంలో రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా పేజీల్లో చూశాను, ఆర్చర్ బౌలింగ్‌లో వైభవ్ అద్భుతమైన షాట్లు ఆడాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్‌కు వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఇక్కడ ఒత్తిడి వేరేలా ఉంటుంది. వైభవ్ అసాధారణమైన టాలెంట్ ఉన్న ఆటగాడే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆర్చర్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్‌ను అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఎదుర్కోవడం అంత సులువు కాదు” అని మొయిన్ అలీ విశ్లేషించాడు.

వైభవ్ సూర్యవంశీకి ఇది మొట్టమొదటి అంతర్జాతీయ సిరీస్ అయినప్పటికీ, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. విశేషం ఏంటంటే, ఈ మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండుసార్లు జోఫ్రా ఆర్చరే వైభవ్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ఈ సిరీస్‌లో ఆర్చర్ వేసిన 13 బంతులను ఎదుర్కొన్న వైభవ్.. 18 పరుగులు రాబట్టినప్పటికీ రెండుసార్లు వికెట్ సమర్పించుకున్నాడు. సీనియర్ ఆటగాడు సంజూ శాంసన్‌ను పక్కనబెట్టి మరీ వైభవ్‌కు జట్టులో చోటు కల్పించడంపై ఇప్పటికే విమర్శలు వస్తున్న తరుణంలో, ఐదో టీ20 మ్యాచ్ వైభవ్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు కూడా కెరీర్ పరంగా జీవన్మరణ సమస్యగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వంట చేయడానికి ముందు స్నానం చేయకపోతే ఏమవుతుంది? సనాతన ధర్మం చెప్పే
వంట చేయడానికి ముందు స్నానం చేయకపోతే ఏమవుతుంది? సనాతన ధర్మం చెప్పే
బన్నీ కోసం బిగ్ ప్లాన్ రెడీ చేస్తున్న లోకేష్‌
బన్నీ కోసం బిగ్ ప్లాన్ రెడీ చేస్తున్న లోకేష్‌
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లో భారీ మార్పులు..? ఇక సాయం నేరుగా..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లో భారీ మార్పులు..? ఇక సాయం నేరుగా..
ఈ గ్రహం దెబ్బకు.. వారికి పట్టపగలే చుక్కలు.. బ్యాడ్ టైం స్టార్ట్..
ఈ గ్రహం దెబ్బకు.. వారికి పట్టపగలే చుక్కలు.. బ్యాడ్ టైం స్టార్ట్..
కండ్ ఇన్నింగ్స్‌లో బ్రేక్ రాకుండా ఉండేందుకు కష్టపడుతున్న బ్యూటీస్
కండ్ ఇన్నింగ్స్‌లో బ్రేక్ రాకుండా ఉండేందుకు కష్టపడుతున్న బ్యూటీస్
ఇంటర్నేషనల్ స్టేజ్‌ మీద రాజమౌళి క్రేజ్‌..
ఇంటర్నేషనల్ స్టేజ్‌ మీద రాజమౌళి క్రేజ్‌..
ప్రభాస్‌, నానిని ఇబ్బంది పెడుతున్న డెడ్‌లైన్ ఇష్యూ..
ప్రభాస్‌, నానిని ఇబ్బంది పెడుతున్న డెడ్‌లైన్ ఇష్యూ..
వియత్నాం టూర్ వెళ్తే మృత్యువు వెంటాడింది!
వియత్నాం టూర్ వెళ్తే మృత్యువు వెంటాడింది!
విభూతి ధరించడం ఎందుకు? దీని వెనుకున్న ఆధ్యాత్మిక పరమార్థం ఏమిటో..
విభూతి ధరించడం ఎందుకు? దీని వెనుకున్న ఆధ్యాత్మిక పరమార్థం ఏమిటో..
ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోన చూడొచ్చు..
ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోన చూడొచ్చు..