Mithli Raj: టీమిండియా ఉమెన్స్ కెప్టెన్ మిథాలీ రాజ్ టాప్ ప్లేస్ సాధించింది. తన 16 ఏళ్ల కెరీర్‌లో మొత్తం తొమ్మిది సార్లు ఐసీసీ ర్యాక్సింగ్స్‌లో తొలిస్థానాన్ని దక్కించుకుంది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింన ఫలితాల్లో మిథాలీ రాజ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. గతవారం ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న విండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్ 30 పాయింట్లు కోల్పోయింది. దీంతో టీమిండియా ఉమెన్స్ కెప్టెన్ తిరిగి తొలిస్థానంలో చేరింది. పాక్‌తో జరిగిన 5 వన్డేల సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో 49, 21 పరుగులు మాత్రమే విండీస్ కెప్టెన్ స్టెఫానీ. దాంతో తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు దిగజారి ఐదో ప్లేస్‌కు పడిపోయింది. మిథాలీ రాజ్ 762 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, దక్షిణాఫ్రికాకు చెందిన లీ 758 పాయంట్లతో రెండవ స్థానంలో చేరింది. ఇక ఆస్ట్రేలియా ప్లేయర్ హెయిలీ 756 పాయింట్లతో మూడవ స్థానం, ఇంగ్లండ్ ప్లేయర్ బేమౌంట్ 754 పాయింట్లతో నాలుగవ స్థానంలో నిలిచింది.
కాగా, పాక్‌తో జరిగిన తొలి వన్డేలో సెంచరీ సాధించడంతో విండీస్ కెప్టెన్ గతవారం తొలి స్థానానికి చేరుకుంది. అలాగే స్టెఫానీ ఆల్‌రౌండర్ల జాబితాలో కూడా ఫస్ట్ ప్లేస్‌ను కోల్పోయింది. ఈ జాబితాలో ఆసీస్ ఆల్‌రౌండర్ ఎలైస్ పెర్రీ టాప్‌కు చేరుకుంది. బౌలింగ్‌లో కూడా స్టెఫానీ మూడు స్థానాలు పడిపోయింది. ఇక టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ మంధాన కెరీర్ అత్యుత్తమ మూడో ర్యాంక్‌కు చేరుకుంది.
? @M_Raj03 has regained her position as the No.1 batter on the @MRFWorldwide ICC Women’s ODI Player Rankings.
Full list: https://t.co/jxTLqOK1gm pic.twitter.com/oAHUTu4eRY
— ICC (@ICC) July 20, 2021
Also Read:
Tokyo Olympics 2021: బోపన్నపై వేటు పడనుందా.. మరింత ముదిరిన ఐటా వివాదం.. డేవిస్ కప్‌లో డౌటే?