IND vs ENG: ఇంగ్లాండ్‌ పర్యటనకు వైభవ్‌ సూర్యవంశీ.. హింటిచ్చిన మాజీ ప్లేయర్

Vaibhav Sooryavanshi Team India Entry: ఐపీఎల్ 2026లో తొలి ప్రదర్శనతోనే వైభవ్ సూర్యవంశీ సత్తా చాటాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

IND vs ENG: ఇంగ్లాండ్‌ పర్యటనకు వైభవ్‌ సూర్యవంశీ.. హింటిచ్చిన మాజీ ప్లేయర్
Ind Vs Eng Vaibhav Sooryavanshi

Updated on: Mar 31, 2026 | 3:12 PM

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ కిరాక్ ఇన్నింగ్స్ తో మారోసారి హాట్ టాపిక్ గా మారాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 15 బంతుల్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఈ యంగ్ ప్లేయర్.. తన దూకుడు ఏంటో చెప్పకనే చెప్పాడు. 14 ఏళ్లకే ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బుడ్డోడు.. ఏకంగా సెంచరీ బాది ఔరా అనిపించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా 15వ ఏట అడుగుపెట్టిన వైభవ్.. అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆమేరకు తన బ్యాటింగ్ ను కూడా మార్చుకుంటున్నాడు. జాతీయ జట్టులోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడంటూ సోషల్ మీడియాలోనూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ మైకెల్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఇంగ్లాండ్ పర్యటించే భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)కి చోటు ఇవ్వాలని బీసీసీకి సూచించాడు.

ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడోనని ఎదురుచూస్తున్నాను. ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్ లోనే తన బ్యాటింగ్ పవర్ చూపించిన వైభవ్.. తన ఉద్దేశ్యం ఏంటో చెప్పాడు. తన ఆటలో చాలా పరిణితి కనిపిస్తోంది. ఈసారి ఇంగ్లాండ్ పర్యటించే భారత జట్టులో ఈ అబ్బాయిని చూడాలని కోరుకుంటున్నాను. ఒకవేశ నేను బీసీసీఐలో ఉంటే, కచ్చితంగా వైభవ్ సూర్యవంశీకి భారత జట్టులో చోటిచ్చేవాడిని. అయితే, డైరెక్ట్ గా బరిలోకి దింపకుండా, కనీసం టీమిండియా డ్రెస్సింగ్ రూంలో ఉంచేలా చూడాలి. పరిస్థితులను అర్థం చేసుకుంటాడు. ఇలా కొంత అనుభవాన్ని కూడా తను పెంచుకుంటాడు. వైభవ్ సూర్యవంశీ రావడం వల్ల జైస్వాల్ కు ఎటువంటి సమస్యలేదు. ఓ ఎండ్ లో జైస్వాల్ ఉండడం వల్ల వైభవ్ కు ఎంతో స్వేచ్ఛ దొరుకుంతుంది. దీంతో తన సహజ సిద్ధమైన ఆటతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

మరి బీసీసీఐ ఈ ఇంగ్లాండ్ ప్లేయర్ వ్యాఖ్యలను పట్టించుకుంటుందా, లేదా అనేది చూడాలి. ఏది ఏమైనా, వైభవ్ సూర్యవంశీ మాత్రం ఇలాంటి తుఫాన్ ఇన్నింగ్స్ లు మరెన్నో ఆడాలని, త్వరలోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుకుందాం.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us