MI vs SRH Score IPL 2021: గెలిచిన ముంబై ఇండియన్స్… ఛేజింగ్‌లో తడబడిన హైదరాబాద్

|

Updated on: Apr 18, 2021 | 12:42 AM

MI vs SRH Live Score in Telugu: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కు మరోసారి ఓటమి ఎదురైంది. వరుసగా ఇది మూడోసారి ఓడిపోవడం.  ఐపీఎల్‌ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హ్యాట్రిక్‌ ఓటమి నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌..

MI vs SRH Score IPL 2021:  గెలిచిన ముంబై ఇండియన్స్... ఛేజింగ్‌లో తడబడిన హైదరాబాద్
Ipl Mi Vs Srh Live

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కు మరోసారి ఓటమి ఎదురైంది. వరుసగా ఇది మూడోసారి ఓడిపోవడం.  ఐపీఎల్‌ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హ్యాట్రిక్‌ ఓటమి నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌ నిర్దేశించిన 151 పరుగుల ఛేజింగ్ లో సన్‌రైజర్స్‌ 19.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. దీంతో ముంబై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.

బెయిర్‌స్టో (43: 22 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు), డేవిడ్‌ వార్నర్‌ (36/ 34 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించినా ఓటమి తప్పలేదు. విజయ్‌ శంకర్‌(28) కాసేపు పోరాడాడు. విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ, కీలక సమయంలో బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్‌, రాహుల్‌ చాహర్‌ చెరో మూడు వికెట్లు తీశారు.

అంతకు ముందు..  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ను కట్టడి చేయడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు. ఓపెనర్లు క్వింటన్‌ డికాక్ ‌(40/ 39 బంతుల్లో 5ఫోర్లు), రోహిత్‌ శర్మ(32/ 25 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసింది. చివర్లో హార్డ్‌హిట్టర్‌ కీరన్‌ పొలార్డ్‌ 35 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు చేయగల్గింది. హైదరాబాద్‌ బౌలర్లలో విజయ్‌ శంకర్‌, ముజీబ్‌ రెహమాన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Apr 2021 11:11 PM (IST)

    గెలువాల్సిన మ్యాచ్‌ను చివరికి…

    ముంబై ఇండియన్స్  విసిరిన  151 పరుగుల టార్గెట్‌ను హైదరాబాద్‌ ఛేదించలేకపోయింది. చివరి ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయి చేజేతులా మ్యాచ్‌ను అప్పగించింది. దీంతో ఈ సీజన్‌లో హైదరాబాద్‌ వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని మూటగట్టుకుంది. కాగా, ముంబైకిది రెండో విజయం. చివరి ఓవర్‌లో బౌల్ట్‌ భువనేశ్వర్‌, ఖలీల్‌ను బౌల్డ్‌ చేయడంతో హైదరాబాద్‌ 19.4 ఓవర్లలో ఆలౌటైంది. ముంబై 13 పరుగుల తేడాతో గెలుపొందింది.

  • 17 Apr 2021 11:09 PM (IST)

    విజయ్ శంకర్ ఔట్..

  • 17 Apr 2021 10:48 PM (IST)

    గెలుపుకు 24 బంతుల్లో 31 పరుగులు కావాలి

    కృనాల్‌ పాండ్య వేసిన 16వ ఓవర్‌లో విజయ్‌ శంకర్‌ రెండు భారీ సిక్సర్లు బాదడంతో ఈ ఓవర్‌లో మొత్తం 16 పరుగులొచ్చాయి. మరోవైపు అబ్దుల్‌ సమద్‌(1) పరుగుతో కొనసాగుతున్నాడు. హైదరాబాద్‌ విజయానికి 24 బంతుల్లో 31 పరుగులు కావాలి.

  • 17 Apr 2021 10:38 PM (IST)

    విరాట్‌ సింగ్‌(11) ఔట్

    రాహుల్‌ చాహర్‌ వేసిన 14.1 ఓవర్‌కు విరాట్‌ సింగ్‌(11) ఔటయ్యాడు. లాంగ్‌ ఆన్‌లో భారీ షాట్‌ ప్రయత్నించిన సూర్యకుమార్‌ యాదవ్ కు దొరికి పోయాడు . దీంతో హైదరాబాద్‌ 102 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. క్రీజులో విజయ్‌ శంకర్‌, అభిషేక్‌ శర్మ ఉన్నారు.

  • 17 Apr 2021 10:30 PM (IST)

    విజయానికి 42 బంతుల్లో 55 పరుగులు కావాలి

    రాహుల్‌ చాహర్‌ వేసిన ఈ ఓవర్‌లో హైదరాబాద్‌ నాలుగు పరుగులే సాధించింది. విరాట్‌(9), విజయ్‌ శంకర్‌(3) చెరో రెండు సింగిల్స్‌ తీశారు. హైదరాబాద్‌ విజయానికి 42 బంతుల్లో 55 పరుగులు కావాలి.

  • 17 Apr 2021 10:23 PM (IST)

    వార్నర్ ఔట్

    సన్‌రైజర్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. పొలార్డ్‌ వేసిన 11.3 ఓవర్‌కు విరాట్‌ సింగిల్‌ కోసం యత్నించగా హార్దిక్‌ పాండ్య డైరెక్ట్‌ త్రో విసరడంతో కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ రనౌటయ్యాడు. దాంతో హైదరాబాద్‌ 90 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. అనంతరం విజయ్‌ శంకర్‌(1) క్రీజులోకి వచ్చాడు.

  • 17 Apr 2021 10:20 PM (IST)

    వార్నర్ సిక్సర్

    రాహుల్‌ చాహర్‌ వేసిన ఈ ఓవర్‌లో సన్‌రైజర్స్‌ 11 పరుగులు రాబట్టింది. తొలి బంతికే వార్నర్‌(35) సిక్సర్‌ కొట్టాడు. తర్వాత మరో ఐదు పరుగులొచ్చాయి. అతడికి విరాట్‌(2) చక్కటి సహకారం అందిస్తున్నాడు. విజయానికి 54 బంతుల్లో 66 పరుగులు కావాలి.

  • 17 Apr 2021 10:16 PM (IST)

    10 ఓవర్లకు...

    పది ఓవర్లు పూర్తయ్యేసరికి సన్‌రైజర్స్‌ రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. పొలార్డ్‌ వేసిన 10వ ఓవర్‌లో మూడు పరుగులే వచ్చాయి. వార్నర్‌(26), విరాట్‌(1) బ్యాటింగ్‌ చేస్తున్నారు.

  • 17 Apr 2021 10:12 PM (IST)

    జానీ బెయిర్‌స్టో ఔట్

    కృనాల్‌ పాండ్య వేసిన ఈ ఓవర్‌లో జానీ బెయిర్‌స్టో  ఔటయ్యాడు. దాంతో సన్‌రైజర్స్‌ 67 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. మరోవైపు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ , మనీశ్‌ పాండే క్రీజులో ఉన్నారు. హైదరాబాద్‌ విజయానికి 72 బంతుల్లో 83 పరుగులు కావాలి.

  • 17 Apr 2021 10:03 PM (IST)

    వార్నర్‌(23) సిక్స్‌

    ఆడమ్‌ మిల్న్‌ వేసిన 7వ ఓవర్‌లో మొదటి మూడు బంతులకు రెండు పరుగులు రాగా..నాలుగో బంతికి వార్నర్‌(23) సిక్స్‌ కొట్టాడు . బెయిర్ స్టో(43) పరుగులతో ఉన్నాడు. 7 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 67 పరుగులతో ఉంది.

  • 17 Apr 2021 09:55 PM (IST)

    బెయిర్ స్టో సిక్సర్.. వార్నర్ బౌండరీ

    కృనాల్ పాండ్య బౌలింగ్‌కు వచ్చాడు . 5వ ఓవర్‌లో రెండో బంతికి బెయిర్‌ స్టో సిక్సర్‌ బాది సింగిల్‌ తీశాడు. వార్నర్‌ (14) చివరి బంతికి ఓ ఫోర్‌ బాదాదు.

  • 17 Apr 2021 09:39 PM (IST)

    బెయిర్‌ స్టో సిక్సర్

    మూడవ ఓవర్ లో సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు కొద్దిగా పుంజుకున్నారు. ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన ఈ ఓవర్‌లో మొదటి రెండు బంతులను బౌండరీలకు తరలించిన బెయిర్‌ స్టో(20) మూడో బంతికి సిక్స్‌ కొట్టాడు . మళ్లీ నాలుగో బంతిని బౌండరీకి పంపాడు. చివరి రెండు బంతులకు పరుగులు రాలేదు. డేవిడ్‌ వార్నర్‌(3)పరుగులతో ఉన్నాడు.

  • 17 Apr 2021 09:31 PM (IST)

    మొదటి ఓవర్‌లో రెండు పరుగులు

    మొదటి ఓవర్‌కు సన్‌రైజర్స్‌ రెండు పరుగులు చేసింది. ట్రెంట్‌ బౌల్ట్‌ ముంబై ఇండియన్స్ బౌలింగ్‌ను ఆరంభించాడు. బౌల్ట్‌ కట్టుదిట్టమైన బంతులేయడంతో మొదటి ఐతు బంతులకు పరుగులేమీ రాలేదు. చివరి బంతికి రెండు పరుగులు వచ్చాయి. డేవిడ్‌ వార్నర్‌(2), జానీ బెయిర్‌ స్టో(0) క్రీజులో ఉన్నారు.

  • 17 Apr 2021 09:25 PM (IST)

    హైదరాబాద్ టార్గెట్ 151 పరుగులు

    చెపాక్‌ మైదానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ను కట్టడి చేయడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు. ఓపెనర్లు క్వింటన్‌ డికాక్ ‌(40/ 39 బంతుల్లో 5ఫోర్లు), రోహిత్‌ శర్మ(32/ 25 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసింది. చివర్లో హార్డ్‌హిట్టర్‌ కీరన్‌ పొలార్డ్‌ 35 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు చేయగల్గింది. హైదరాబాద్‌ బౌలర్లలో విజయ్‌ శంకర్‌, ముజీబ్‌ రెహమాన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

  • 17 Apr 2021 09:02 PM (IST)

    హార్దిక్ పాండ్య ఔట్

    ఖలీల్‌ అహ్మద్ వేసిన 19 ఓవర్‌లో నాలుగో బంతికి హార్దిక్ పాండ్య విరాట్ సింగ్‌కు చిక్కాడు.

  • 17 Apr 2021 08:53 PM (IST)

    కిషన్ ఔట్

    ముజీబుర్‌ రెహ్మాన్‌ వేసిన 16వ ఓవర్‌లో మొదటి బంతికి పొలార్డ్‌(10 ) సిక్సర్‌ బాదగా.. ఐదో బంతికి ఇషాన్‌ కిషన్  కీపర్‌కు క్యాచి ఇచ్చి వెనుదిరిగాడు. 17 ఓవర్లకు ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది.

  • 17 Apr 2021 08:48 PM (IST)

    16వ ఓవరల్‌లో...

    16 ఓవర్లకు ముంబై ఇండియన్స్ మూడు వికెట్ల నష్టానికి  107 పరుగులతో కొనసాగుతోంది. ఇక రషీద్‌ ఖాన్‌ కట్టుదిట్టమైన బంతులేయడంతో పరుగులు చేయడానికి ముంబై బ్యాట్స్‌మెన్‌ చెమట్చోడుతున్నారు. ఈ ఓవర్‌లో 6 పరుగులు మాత్రమే వచ్చాయి. పొలార్డ్(3), కిషన్‌(12) క్రీజులో ఉన్నారు.

  • 17 Apr 2021 08:37 PM (IST)

    12 ఓవర్లలో...

    ముంబై 12 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. క్వింటన్ డి కాక్ తోపాటు ఇషాన్ కిషన్ మైదానంలో ఆడుతున్నారు.

  • 17 Apr 2021 08:28 PM (IST)

    డికాక్ ఫోర్

    రషీద్‌ ఖాన్‌ వేసిన ఈ ఓవర్‌లో నాలుగో బంతికి డికాక్‌ ఫోర్‌ కొట్టాడు. మొత్తం ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. కిషన్‌ (5) ఆడుతున్నాడు. 12 ఓవర్లకు ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 89 పరుగులతో కొనసాగుతోంది.

  • 17 Apr 2021 08:12 PM (IST)

    సూర్య కుమార్ యాదవ్ ఔట్

    విజయ్‌ శంకర్‌ వేస్తున్న 9 ఓవర్‌లో రెండో బంతికి సిక్స్‌ కొట్టిన సూర్య కుమార్ యాదవ్... ఆ తర్వాతి బంతికి శంకర్‌కే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 17 Apr 2021 08:09 PM (IST)

    డికాక్ బౌండరీ

  • 17 Apr 2021 08:04 PM (IST)

    రోహిత్ ఔట్

    ఆరో ఓవర్‌లో విరాట్ వేసిన బంతి షాట్ కొట్టేందుకు ప్రయత్నించిన రోహిత్ ఔటయ్యాడు

  • 17 Apr 2021 07:57 PM (IST)

    రోహిత్ మరో బౌండరీ

    ఖలీల్‌ అహ్మద్‌ వేసిన ఈ ఓవర్‌లో మూడో బంతికి రోహిత్ బౌండరీగా మార్చాడు. ఆఖరి బంతికి డికాక్‌ (15)కూడా ఓ ఫోర్ బాదడంతో ఈ ఓవర్‌కు మొత్తం 10 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు ముంబై ఇండియన్స్ వికెట్ల కోల్పోకుండా 48 పరుగులు చేసింది.

  • 17 Apr 2021 07:50 PM (IST)

    రోహిత్ మరో సిక్స్..

    4 ఓవర్లకు ముంబై ఇండియన్స్  38 చేసింది. భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌ లో రెండు, మూడు బంతులకు సింగిల్స్‌ వచ్చాయి. అయితే అయిదో బంతికి రోహిత్‌ భారీ సిక్స్‌ కొట్టాడు. మొత్తం ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. డికాక్‌ (11) క్రీజులో ఉన్నాడు.

  • 17 Apr 2021 07:36 PM (IST)

    ఈ మార్పులతో రెండు జట్లు..

    ఈ మ్యాచ్ కోసం రెండు జట్లలో మార్పులు చేయబడ్డాయి. ముంబైలో 1 మార్పు జరిగింది. ఫాస్ట్ బౌలర్ మార్కో యాన్సన్ స్థానంలో ఆడమ్ మిల్నేకు అవకాశం ఇవ్వబడింది. హైదరాబాద్ మొత్తం 4 మార్పులు చేసింది. అభిషేక్ శర్మ, విరాట్ సింగ్, ఖలీల్ అహ్మద్, ముజిబ్ ఉర్ రెహ్మాన్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా విరాట్ సింగ్ అరంగేట్రం చేశారు. హైదరాబాద్ తరఫున ముజీబ్‌కు ఇది తొలి మ్యాచ్.

  • 17 Apr 2021 07:18 PM (IST)

    తుది జట్లు ఇవే...

    ఇరు జట్ల వివరాలు ఇలా ఉన్నాయి..

    సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ ఎలెవన్): డేవిడ్ వార్నర్ (సి), జానీ బెయిర్‌స్టో (డబ్ల్యూ), మనీష్ పాండే, విరాట్ సింగ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్

    ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ ఎలెవన్): రోహిత్ శర్మ (సి), క్వింటన్ డి కాక్ (డబ్ల్యూ), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహర్, ఆడమ్ మిల్నే, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

  • 17 Apr 2021 07:16 PM (IST)

    ముంబై vs హైదరాబాద్ ఫేస్ టు ఫేస్..

    ఐపీఎల్ 14 వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ రోజు ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

Published On - Apr 18,2021 12:03 AM

Follow us
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!