AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs LSG Match Highlights, IPL 2022: ముంబైకి మరో పరాజయం.. వరుసగా ఆరో మ్యాచ్‌ను కోల్పోయిన జట్టు..

Mumbai Indians vs Lucknow Super Giants Live Score in telugu: ఐపీఎల్‌ 2022 (IPL 2022)లో ఇప్పటి వరకు ఖాతా తెరవని ముంబైకి మరో పరాజయం ఎదురైంది. పాయింట్ల జాబితాలో చివరి స్థానంలో ఉన్న ముంబై లక్నోతో జరిగిన మ్యాచ్‌లోనైనా విజయాన్ని సాధించాలనే ఆశ నిరాశే అయ్యింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇచ్చిన..

MI vs LSG Match Highlights, IPL 2022: ముంబైకి మరో పరాజయం.. వరుసగా ఆరో మ్యాచ్‌ను కోల్పోయిన జట్టు..
Ipl 2022
Narender Vaitla
|

Updated on: Apr 16, 2022 | 7:53 PM

Share

Mumbai Indians vs Lucknow Super Giants Highlights in telugu:  ఐపీఎల్‌ 2022 (IPL 2022)లో ఇప్పటి వరకు ఖాతా తెరవని ముంబైకి మరో పరాజయం ఎదురైంది. పాయింట్ల జాబితాలో చివరి స్థానంలో ఉన్న ముంబై లక్నోతో జరిగిన మ్యాచ్‌లోనైనా విజయాన్ని సాధించాలనే ఆశ నిరాశే అయ్యింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇచ్చిన 200 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో చివరి వరకు పోరాడి ఓడింది. చివరి క్షణాల్లో పోలార్డ్‌, జయదేవ్ ఉనద్కత్ దూకుడు మీద ఆడినా విజయాన్ని మాత్రం అందుకోలేక పోయారు. నిర్ణీత 20 ఓవర్లలో పరుగులు చేసిన పరాజయం పొందింది. చివరి ఓవర్‌లో విజయానికి 26 పరుగులు కావాల్సి ఉండగా కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 18 పరుగుల తేడాతో లక్నో చేతిలో ఓటమై పాలైంది. ఇలా ముంబై తన ఖాతాలో ఒక్క విజయాన్ని కూడా వేసుకోలేకపోయింది.

ఇరు జట్ల సభ్యులు.. (అంచనా)

లక్నో XI – కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, జాసన్ హోల్డర్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.

ముంబై XI – రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్/రిలే మెరెడిత్, జయదేవ్ ఉనద్కత్

Key Events

ముంబైకి కీలక మ్యాచ్‌..

సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్‌ తొలి విజయం కోసం కసితో ఉంది. పాయింట్ల పట్టికలో చివరల్లో ఉన్న ముంబైకి ఈ విజయం అనివార్యంగా మారింది.

విజయాలే లక్నోకు బలం..

రాహుల్‌ సారథ్యంలోని లక్నో సూపర్‌ జెయింట్స్‌ తొలిసారి సీజన్‌లో ఆడుతోన్న మంచి ఫామ్‌లో ఉంది. ఇప్పటికే మూడు విజయాలు అందుకున్న లక్నో అదే జోరుతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఇదే ఆ జట్టుకు బలంగా కనిపిస్తోంది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 16 Apr 2022 07:34 PM (IST)

    ముంబైకి మరో పరాజయం..

    ముంబై ఇండియన్స్‌కి మరో పరాజయం ఎదురైంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ముంబైకి ఇది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం. లక్నో ఇచ్చిన లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగలు మాత్రమే చేసి 18 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది.

  • 16 Apr 2022 07:06 PM (IST)

    మరో వికెట్‌..

    ముంబై ఇండియన్స్‌ వరుస వికెట్లు కోల్పోతూ కష్టాల్లోకి జారుకుంటోంది. తిలక్‌ వర్మ అవుట్‌ అయిన కొన్ని క్షణాలకే సూర్య కుమార్‌ యాదవ్‌ రూపంలో మరో వికెట్‌ పడింది. రవి బిష్ణోయ్‌ బౌలింగ్లో గౌతమ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ 16 ఓవర్లు ముగిసే సమయానికి 132 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 16 Apr 2022 07:02 PM (IST)

    నాలుగో వికెట్‌ గాన్‌..

    ముంబై ఇండియన్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. తిలక్ వర్మ 26 పరుగుల వద్ద అవుట్‌ అయ్యాడు. హోల్డర్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.

  • 16 Apr 2022 06:12 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన ముంబై ఇండియన్స్‌..

    ముంబై ఇండియన్స్‌ మూడో వికెట్‌ను కోల్పోయింది. కేవలం 13 పరుగులు మాత్రమే చేసిన ఇషాన్‌ కిషన్‌ మార్కస్‌ స్టోయినిస్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో ముంబై కేవలం 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో జారుకుంది.

  • 16 Apr 2022 06:07 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన ముంబై..

    లక్నో ఇచ్చిన 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. డెవాల్డ్‌ బ్రెవిస్‌ దీపక్‌ హుడాకు క్యాచ్‌ ఇచ్చి అవుట్ అయ్యాడు. అవెష్‌ ఖాన్‌ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్‌ బాట పట్టాడు.

  • 16 Apr 2022 05:51 PM (IST)

    ఐపీఎల్‌ చరిత్రలో అరుదైన రికార్డు.

    లక్నో జెయింట్స్‌ కెప్టెన్‌ రాహుల్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో తాను ఆడుతున్న 100వ మ్యాచ్‌లో 100 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా రాహుల్‌ అరుదైన రికార్డును సృష్టించాడు.

  • 16 Apr 2022 05:48 PM (IST)

    తొలి వికెట్‌ కోల్పోయిన ముంబై..

    ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్‌ శర్మ రూపంలో లక్నోకు బిగ్‌ వికెట్‌ దొరికింది. అవేష్‌ ఖాన్‌ బౌలింగ్‌లో డి కాక్‌కు క్యాచ్‌ ఇచ్చిన రోహిత్‌ పెవిలియన్‌ బాట పట్టాడు.

  • 16 Apr 2022 05:21 PM (IST)

    భారీ విజయ లక్ష్యం..

    లక్నో బ్యాట్స్‌మెన్‌ దుమ్ము రేపారు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో బ్యాట్స్‌మెన్‌ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగులు సాధించారు. తప్పకుండా విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో ముంబై 200 పరుగులు చేయాలి. మరి లక్నో ఇచ్చిన లక్ష్యాన్ని ముంబై చేధిస్తుందో లేదో చూడాలి.

  • 16 Apr 2022 05:12 PM (IST)

    శతకం బాదేసిన రాహుల్‌..

    లక్నో సూపర్ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 57 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేసుకొని జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు.

  • 16 Apr 2022 04:55 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన లక్నో..

    మార్కస్‌ స్టోయినిస్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. 10 పరుగుల స్కోర్ వద్ద జయదేవ్‌ ఉనద్కత్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు.

  • 16 Apr 2022 04:51 PM (IST)

    సెంచరీ దిశగా రాహుల్‌..

    రాహుల్‌ దంచి కొడుతున్నాడు. జట్టు స్కోరును పెంచే క్రమంలో దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 46 బంతుల్లోనే 5 సిక్సర్లు, 6 ఫోర్లతో 81 పరుగుల వద్ద కనొసాగుతున్నాడు. ప్రస్తుతం లక్నో స్కోర్‌ బోర్డ్‌ 16 ఓవర్లు ముగిసే సమయానికి 155 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 16 Apr 2022 04:41 PM (IST)

    మంచి భాగస్వామ్యానికి బ్రేక్‌..

    జట్టు స్కోరు వేగంగా దూసుకెళుతోన్న క్రమంలో లక్నోకు ఎదురు దెబగ్గ తగిలింది. 29 బంతుల్లోనే 38 పరుగులు చేసిన మానిస్‌ పాండే మురగన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఇక రాహుల్‌, మానిష్‌ పాండేలు కలిసి 72 పరుగులు సాధించారు.

  • 16 Apr 2022 04:26 PM (IST)

    హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్‌..

    జట్టు స్కోరును పరుగు పెట్టిస్తున్న కేఎల్ రాహుల్‌ తన హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కేవలం 33 బంతుల్లోనే 50 పరులు మార్క్‌ను దాటేశాడు.

  • 16 Apr 2022 04:13 PM (IST)

    దంచి కొడుతోన్న రాహుల్‌..

    లక్నో తొలి వికెట్‌ను కోల్పోయినా స్కోర్ వేగం మాత్రం తగ్గడం లేదు. కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. కేవలం 27 బంతుల్లోనే 40 పరుగులు సాధించాడు. ఇక మానిష్‌ పాండే కూడా రాహుల్‌కు తోడుగా నిలిచి పరుగులు రాబడుతున్నాడు. ప్రస్తుతం లక్నో 9 ఓవర్లు ముగిసే సమయానికి 1 వికెట్‌ నష్టపోయి 84 పరుగుల వద్ద కొనసాగుతోంది

  • 16 Apr 2022 03:59 PM (IST)

    లక్నో స్పీడ్‌కు బ్రేక్‌లు..

    చెలరేగి ఆడుతోన్న లక్నో ఓపెనర్ల జోరుకు బ్రేక్‌లు పడ్డాయి. కేవలం 13 బంతుల్లోనే 24 పరుగులు చేసి జోరు మీదున్న క్వింటన్‌ అవుట్‌ అయ్యాడు. ఫాబియన్‌ అలెన్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

  • 16 Apr 2022 03:56 PM (IST)

    దూసుకుపోతున్న లక్నో స్కోర్‌..

    లక్నోకు ఓపెనర్లు మంచి శుభారంభం ఇచ్చారు. ఈ క్రమంలోనే నాలుగో ఓవర్‌లో ఏకంగా 16 పరుగులు సాధించారు. వరుస బౌండరీలతో జట్టు స్కోరు దూసుకుపోతోంది.

  • 16 Apr 2022 03:45 PM (IST)

    లక్నోకు మంచి ప్రారంభాన్ని ఇచ్చిన ఓపెనర్స్‌..

    టాస్‌ ఓడి బ్యాటింగ్ మొదలు పెట్టిన లక్నో జట్టుకు ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, క్వింటన్‌ డి కాక్‌ మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. వికెట్‌ కోల్పోకుండా ఆచితూచి ఆడుతున్నారు. ముడూ ఓవర్లు ముగిసే సమయానికి 27 పరుగులు సాధించారు. ప్రస్తుతం రాహుల్‌ (9), డి కాక్‌ (18) పరుగులతో కొనసాగుతున్నారు.

  • 16 Apr 2022 03:34 PM (IST)

    జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఫాబియన్ అలెన్..

  • 16 Apr 2022 03:15 PM (IST)

    ఇరు జట్ల సభ్యులు..

    లక్నో XI – కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, మానిష్‌ పాండే, దీపక్ హుడా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దుష్మంత చమీరా.

    ముంబై XI – రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, జయదేవ్ ఉనద్కత్

  • 16 Apr 2022 03:04 PM (IST)

    టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌..

    టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ తొలుత బౌలింగ్ చేయడానికి మొగ్గుచూపింది. పిచ్‌ ఛేజింగ్‌కు అనుకూలించడంతో ముంబై తొలుత బ్యాటింగ్‌ చేసే అవకాశం లక్నోకు ఇచ్చింది. మరి రోహిత్‌ శర్మ తీసుకున్న ఈ నిర్ణయం జట్టుకు ఏ మేర ఉపయోగపడుతుందో చూడాలి.

Published On - Apr 16,2022 3:00 PM