ఐసీసీ ప్రపంచకప్ 2019లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఈరోజు ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరగాల్సిన మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారింది. ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో.. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. తాజాగా వర్షం జోరందుకుంది. అంపైర్లు ఔట్ ఫీల్డ్‌ని ఇంకా పరిశీలించాల్సి ఉండటంతో.. 2.30 గంటలకి వేయాల్సిన టాస్ ఆలస్యంకానుంది.
టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన భారత్ జట్టు.. వరుసగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాపై ఘన విజయాలతో మంచి జోరుమీదుంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడి.. వరుసగా శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లను ఓడించింది. తాజా వరల్డ్‌కప్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడని జట్లు.. భారత్, న్యూజిలాండ్ మాత్రమే కావడం విశేషం. ఒకవేళ ఈరోజు మ్యాచ్‌లో భారత్ జట్టు భారీ తేడాతో గెలవగలిగితే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకనుంది.
Well, the rain has got heavier and the covers are on #CWC19 pic.twitter.com/8WYSK1Or4J
— BCCI (@BCCI) June 13, 2019