T20 Cricket: కాకా.. నువ్వు కేక.. 4 ఓవర్లలో 8 పరుగులిచ్చి 7 వికెట్లు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన 32 ఏళ్ల బౌలర్..

Syazrul Ezat: సయజ్రుల్ ఇడారెస్ తన 4 ఓవర్ల కోటాలో 8 పరుగులు మాత్రమే ఇచ్చి 7 మంది బ్యాట్స్‌మెన్స్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో పురుషుల టీ20లో 7 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు.

T20 Cricket: కాకా.. నువ్వు కేక.. 4 ఓవర్లలో 8 పరుగులిచ్చి 7 వికెట్లు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన 32 ఏళ్ల బౌలర్..
Syazrul Idrus World Record

Updated on: Jul 26, 2023 | 2:53 PM

టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర నమోదైంది. బౌలర్లు ఇంతకుముందు చాలాసార్లు 4 లేదా 5 వికెట్లు తీశారు. అయితే, పురుషుల T20Iలో 7 వికెట్లు తీయడం మొదటిసారి కనిపించింది. చైనా, మలేషియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఈ ప్రపంచ రికార్డ్ నమోదైంది. కౌలాలంపూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో అద్బుత మాయాజాలం కనిపించింది. మరి, ఈ మ్యాచ్‌లో గెలవడానికి మలేషియా కేవలం 29 బంతులు మాత్రమే ఆడడం మరో విశేషం.

పురుషుల T20 చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగని పనిని చేసిన 32 ఏళ్ల బౌలర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 7 వికెట్లు తీసిన ఈ మలేషియా బౌలర్ పేరు సైజ్రుల్ ఇడారెస్.

ఇవి కూడా చదవండి

మలేషియా బౌలర్ విధ్వంసం, చైనాపై ప్రభావం..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చైనా జట్టు రెండంకెల స్కోరును సులువుగా తాకింది. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా సయాజ్రుల్ ధాటికి దిగడంతో చైనా బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు తప్పలేదు. ఒక్కొక్కరుగా బ్యాట్స్‌మెన్‌లు సయజ్రుల్‌కు ఎదురుగా వచ్చి ఔటయ్యి డగౌట్‌కు చేరుకున్నారు.

4 ఓవర్లు, 8 పరుగులు, 7 వికెట్లు.. పురుషుల టీ20లో ప్రపంచ రికార్డ్..

సయజ్రుల్ ఇదార్స్ తన 4 ఓవర్ల కోటాలో 8 పరుగులు మాత్రమే ఇచ్చి ఏడుగురు చైనీయులను బలిపశువులను చేశాడు. తద్వారా పురుషుల టీ20లో 7 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతను మొత్తం ఏడుగురు చైనా బ్యాట్స్‌మెన్‌లను క్లీన్ బౌల్డ్ చేశాడు.

23 పరుగులకే చైనా ఆలౌట్..


రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ సయాజ్రుల్ ఇద్రాస్ చేసిన విధ్వంసం ప్రభావంతో మొత్తం చైనా జట్టు కేవలం 23 పరుగులకే ఆలౌట్ అయింది. అంటే మలేషియా గెలవడానికి 24 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. అది 91 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు కోల్పోయి సాధించింది. అంటే 29 బంతుల్లోనే 8 వికెట్ల తేడాతో మలేసియా జట్టు విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..