
ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లో టీం ఇండియా అద్భుతంగా ఆడుతోంది. ఈ టోర్నీలో మొదట బంగ్లాదేశ్‌ను, ఆ తర్వాత పాకిస్థాన్‌ను ఓడించి భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా తన తదుపరి మ్యాచ్ ఆదివారం (మార్చి 02)న న్యూజిలాండ్ తో ఆడనుంది. కాగా దుబాయ్ లో జరిగిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు పలువురు టీమిండియా క్రికెటర్లు హాజరయ్యారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ తదితరులు స్టేడియానికి వచ్చి భారత్ కు మద్దతు పలికారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. కాగా మహా శివరాత్రి సందర్భంగా టీమిండియా క్రికెటర్లు ముంబైలోని పురాతన బాబుల్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. తిలక్ వర్మతో పాటు దీపక్ చాహర్ మరియు కర్ణ్ శర్మ లు మహా శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు తిలక్ వర్మ. అందులో ముగ్గురూ సంప్రదాయ దుస్తులు ధరించి నుదుటిపై తిలకం, మెడలో రుద్రాక్ష మాలలతో కనిపించారు. ‘హర్ హర్ మహాదేవ్’ అని తమ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చాడు తిలక్ వర్మ.
ఐపీఎల్ 2025లో దీపక్ చాహర్, తిలక్ వర్మ, కర్ణ్ శర్మ ఒకే జట్టు తరపున ఆడనున్నారు. ఐపీఎల్ 2025 వేలంలో దీపక్‌ను ముంబై ఇండియన్స్ రూ. 9.25 కోట్లకు కొనుగోలు చేసింది. స్పిన్నర్ కర్ణ్ శర్మను ముంబై రూ. 50 లక్షలకు చేర్చుకుంది. ఇక తిలక్ ఇప్పటికే జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్నాడు. ముంబై జట్టు అతన్ని 8 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది.
ఐపీఎల్ తదుపరి సీజన్ మార్చి 22 నుండి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. మే 25న ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే మైదానంలో జరుగుతుంది. ఈ మెగా క్రికెట్ టోర్నీలో ఫైనల్‌తో సహా మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి. టైటిల్ కోసం 10 జట్లు పోటీ పడుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..