LSG vs MI, IPL 2023 Eliminator: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా మంగళవారం జరిగిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ని చెన్నై సూపర్ కింగ్స్ ఓడించి ఫైనల్‌కి చేరిన సంగతి తెలిసిందే. ఇక టోర్నీ లీగ్ దశ, మొదటి క్వాలిఫైయర్ ముగిసిన నేపథ్యంలో.. నేడు లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ ఐపీఎల్ ఫైనల్ కోసం రెండో క్వాలిఫైయర్‌లో గుజరాత్ టైటాన్స్‌తో బరిలోకి దిగుతుంది. అలాగే ఓడిన టీమ్ ఇంటి బాట పడుతుంది. ఈ నేపథ్యంలోనే నేటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఎలా అయినా గెలిచి ఫైనల్ రేసులో నిలిచేందుకు అటు లక్నో, ఇటు ముంబై జట్టు తహతహలాడుతున్నాయి.
అయితే బ్యాటింగ్ విషయంలో లక్నో కంటే ముంబై టీమ్ చాలా బలంగా ఉంది. కానీ వరుస విజయాలతో ఉన్న లక్నో టీమ్ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇంకా లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ముంబై ఇండియన్స్ చేతిలో ఒక్క సారి కూడా ఓడిపోలేదు. ఈ ఇరు జట్లు తలపడిన మూడో మ్యాచ్‌ల్లోనూ లక్నో టీమ్‌దే విజయం. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్‌కి లక్నో సూపర్ జెయింట్స్ ఒక గండం వంటిదే అని చెప్పుకోవాలి. మరి కీలకమైన నేటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో, ముంబై ప్రదర్శన ఎలా ఉండబోతుందో చూడాల్సిందే.
It's showtime. ?? pic.twitter.com/KHPvFrXB4s
— Lucknow Super Giants (@LucknowIPL) May 24, 2023
ఇక ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికే 5 సార్లు టోర్నీ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ టీమ్ బలంబలహీనతల విషయానికొస్తే.. బ్యాటింగ్ ఆర్డర్ అద్భుతంగా ఉంది. లీగ్ దశలో రోహిత్ నిరాశపరిచినా.. చివరి మ్యాచ్‌లో అర్థశతకంతో రాణించాడు. అలాగే ఇషాన్ కిషన్ నిలకడగా రాణిస్తున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చే కామెరూన్ గ్రీన్ కూడా సెంచరీ బాదిన ఉత్సాహంతో టీమ్‌కి బలంగా ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్ వంటి మిడిలార్డర్ ప్లేయర్లు కూడా ఒకటి, రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా టోర్నీలో బాగానే రాణించారు. ఇక బౌలింగ్‌లో విఫలమైన క్రిస్ జోర్డాన్ స్థానంలో జేసన్ బెహ్రెండాఫ్ టీమ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక సీనియర్ స్నిన్నర్ పియూష్ చావ్లా ముంబైకి కీలకం కానున్నాడు. ఇంకా ఆకాష్ మధ్వల్, హృతిక్ షోకీన్ కూడా బౌలింగ్‌లో రాణించాలి.
అటు లక్నో విషయానికొస్తే.. ఓపెనర్లు కైల్ మేయర్స్, క్వింటన్ డి కాక్ నిలకడగా రాణిస్తున్నా పెద్ద స్కోర్లు చేయలేకపోతున్నారు. అలాగే ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తేనే ముంబై ముందు భారీ స్కోరు నిలపడం లేదా ఆ టీమ్ ఇచ్చిన భారీ స్కోరును చేధించగలరు. ఇక టీమ్‌కి నికోలస్ పూరన్ గట్టి బలం అని చెప్పుకోవాలి. అలాగే కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్ బౌలింగ్ సేవలు మెరుగ్గా ఉంటేనే బలమైన ముంబై బ్యాటర్స్‌ని అడ్డుకోగలరు.
Mumbai Indians XI: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, జేసన్ బెహ్రెండాఫ్, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, హృతిక్ షోకీన్
Lucknow Super Giants XI: కైల్ మేయర్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..