CSK vs LSG Match Prediction, Playing XI: తొలి విజయం కోసం ప్లేయింగ్ XI కీలక మార్పులు.. లక్నో, చెన్నై జాబితా ఎలా ఉండనుందంటే?

|

Mar 31, 2022 | 6:02 AM

Lucknow Super Giants vs Chennai Super Kings: తొలి మ్యాచ్‌లో ఓడిన లక్నో సూపర్ జెయింట్, చెన్నై సూపర్ కింగ్స్ రెండో మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌ను మార్చే అవకాశం ఉంది.

CSK vs LSG Match Prediction, Playing XI: తొలి విజయం కోసం ప్లేయింగ్ XI కీలక మార్పులు.. లక్నో, చెన్నై జాబితా ఎలా ఉండనుందంటే?
Lsg Vs Csk Playing Xi Ipl Lucknow Super Giants Team Chennai Super Kings Team (1)
Follow us on

ఐపీఎల్ 2022(IPL 2022) లో ఓటమితో ప్రారంభమైన లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు గురువారం తలపడనున్నాయి. ముంబయిలోని బ్రబౌర్న్‌ మైదానంలో ఇరు జట్ల చూపు ఈ సీజన్‌లో తొలి విజయంపైనే ఉంటుంది. లీగ్‌లో తొలిసారిగా ఆడుతున్న లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) ఇప్పటికే ఐపీఎల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, కెప్టెన్సీ విషయంలో అనుభవం లేని రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చేతుల్లోకి చెన్నై కమాండ్‌ను అప్పగించింది. లీగ్ పేలవమైన ప్రారంభం తర్వాత, ఇప్పుడు రెండు జట్లూ ఎలాగైనా గెలవాలని కోరుకుంటాయి. ఇందుకోసం కోసం ఇరుటీంలు తమ ప్లేయింగ్ XIలో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది.

ఫాస్ట్ బౌలర్ దుష్మంత్ చమీరా ధాటికి అవేష్ ఖాన్ దగ్గర మాట్లలు లేకపోయాయి. దీంతో పాటు స్పిన్‌ త్రయం రవి బిష్ణోయ్‌, హుడా, కృనాల్‌ల పాత్ర కూడా మ్యాచ్‌ ఫలితాన్ని నిర్ణయించడంలో కీలకం కానుంది. అదే సమయంలో టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ రాణించలేకపోవడమే చెన్నై ఓటమికి కారణం. బ్రబౌర్న్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో దాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తుంది.

లక్నో బౌలింగ్‌‌లో పలు మార్పులు..

లక్నో జట్టు బ్యాటింగ్ గురించి చెప్పాలంటే, ఇక్కడ పెద్దగా మార్పు ఆశించలేదు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ ఓపెనర్ క్వింటన్ డి కాక్ తొలి మ్యాచ్‌లో సత్తా చాటలేకపోయారు. ఈ మ్యాచ్‌లో దాన్ని భర్తీ చేయాలని వారు భావిస్తున్నారు. మనీష్ పాండే, ఎవిన్ లూయిస్‌లను ముందుగానే ఔట్ చేసిన తర్వాత దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా మిడిలార్డర్‌లో బాధ్యతలు స్వీకరించడం లక్నోకు శుభసూచకం. అయితే, జట్టు బౌలింగ్‌లో తక్షణ మెరుగుదల అవసరం. దీని కోసం వారు ప్లేయింగ్ XIలో మార్పులు చేయవచ్చు. చివరి మ్యాచ్‌లో మొహ్సిన్ ఖాన్‌కు బదులుగా అంకిత్ రాజ్‌పుత్‌కు రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వవచ్చు.

మొయిన్ అలీ తిరిగి వచ్చే అవకాశం..

చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడితే, వారి స్టార్ బ్యాట్స్‌మెన్ మొయిన్ అలీ తిరిగి రావడం ఖాయంగా కనిపిస్తోంది. వీసా వివాదం తర్వాత ముంబైకి ఆలస్యంగా చేరుకోవడంతో అతను తొలి మ్యాచ్‌లో జట్టులో భాగం కాలేకపోయాడు. అయితే, మొయిన్‌ ఎవరి ప్లేస్‌లో రానున్నాడో చూడాలి. మిచెల్ సాంట్నర్ లేదా డెవాన్ కాన్వే బదులుగా రావొచ్చు. మొయిన్ పునరాగమనంతో రితురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప కూడా ఓపెనర్లు అయ్యే అవకాశం ఉంది. అయితే, జట్టు బౌలింగ్ ఎటాక్‌లో మార్పు కనిపించడం లేదు.

ఇరు జట్లు తొలిసారి తలపడనున్నాయి. కాబట్టి ఎవరిపై ఎవరు గెలుస్తారో ఊహించలేం. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకు ఎక్కువ అనుభవం ఉంది. ఈ విషయం వారికి అనుకూలంగా ఉంటుంది. లక్నో ఓటమి, విజయం బౌలర్లపైనే ఆధారపడి ఉన్నాయి.

ఇరు జట్లు..

చెన్నై సూపర్ కింగ్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI – రితురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే/మిచెల్ సాంట్నర్, మొయిన్ అలీ, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోని (కీపర్), శివమ్ దూబే, డ్వేన్ బ్రావో, ఆడమ్ మిల్నే, తుషార్ దేశ్‌పాండే

లక్నో సూపర్ జెయింట్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI– KL రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, మొహ్సిన్ ఖాన్/ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దుష్మంత చమీరా