వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తేజ్‌నారాయణ్ వికెట్ తీసి అశ్విన్ ప్రత్యేక ఫీట్‌ను సొంతం చేసుకున్నాడు.ఈ మ్యాచ్‌లో శివనారాయణ్ చంద్రపాల్ కుమారుడు తేజ్‌నారాయణ్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో టెస్టు క్రికెట్‌లో తండ్రీ కొడుకులను ఔట్ చేసిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. అంతకుముందు 2011లో శివనారాయణ్ చంద్రపాల్ ఔట్ అయ్యాడు. టెస్టు క్రికెట్‌లో తండ్రీ కొడుకులను అవుట్ చేసిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలో 5వ బౌలర్‌గా కూడా నిలిచాడు. ఇంతకు ముందు ఇలాంటి రికార్డు సృష్టించిన బౌలర్లు ఎవరో తెలుసుకుందాం రండి.
1. ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ బోథమ్ టెస్టు క్రికెట్‌లో తొలిసారి తండ్రీ కొడుకులను ఔట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌కు చెందిన లాన్స్ కెయిర్న్స్ (తండ్రి), క్రిస్ కెయిర్న్స్ (కొడుకు) వికెట్లు తీసి ఈ ఘనత సాధించారు
2. వసీం అక్రమ్ (పాకిస్థాన్): పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా న్యూజిలాండ్ ఆటగాళ్లు లాన్స్ కెయిర్న్స్, క్రిస్ కెయిర్న్స్ వికెట్లు తీశాడు.
3. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా): వెస్టిండీస్‌కు చెందిన శివనారాయణ చంద్రపాల్ (తండ్రి), తేజ్‌నారాయణ్ చంద్రపాల్ (కొడుకు) వికెట్లు తీసి ఆసీస్ లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డు సృష్టించాడు.
4. సైమన్ హార్మర్ (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికా బౌలర్ సైమన్ హార్మర్ కూడా శివనారాయణ్ చంద్రపాల్, తేజ్‌నరైన్ చంద్రపాల్ వికెట్లు తీశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..