AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kuldeep Yadav : అరె ఏంటి భయ్యా ఇది.. 4 వికెట్లు తీసినా… తర్వాతి మ్యాచ్ నుంచి కుల్దీప్‎ను తీసేస్తారా.. ఇదేమన్నా న్యాయమేనా ?

యూఏఈపై కుల్దీప్ తన బౌలింగ్‌తో విరుచుకుపడుతున్న సమయంలో, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తన 'ఎక్స్' అకౌంట్‌లో ఒక పోస్ట్ చేశాడు. "కుల్దీప్ ఒక ఓవర్లో 3 వికెట్లు తీశాడు. ఇప్పుడు బహుశా తదుపరి మ్యాచ్ ఆడకపోవచ్చు" అని రాశాడు. మంజ్రేకర్ ఎందుకు అలా రాశాడు? అతను ఏమైనా వ్యూహం గురించి మాట్లాడుతున్నాడా?

Kuldeep Yadav : అరె ఏంటి భయ్యా ఇది.. 4 వికెట్లు తీసినా... తర్వాతి మ్యాచ్ నుంచి కుల్దీప్‎ను తీసేస్తారా.. ఇదేమన్నా న్యాయమేనా ?
Kuldeep Yadav (1)
Rakesh
|

Updated on: Sep 11, 2025 | 7:44 AM

Share

Kuldeep Yadav : ఆసియా కప్ 2025 తొలి మ్యాచ్‌లో కుల్‌దీప్ యాదవ్, యూఏఈ బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టి ఒక్కొక్కరిని పెవిలియన్‌కు పంపించాడు. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి, టీం ఇండియా స్టార్ స్పిన్నర్ యూఏఈని కష్టాల్లో పడేశాడు. ఈ మ్యాచ్‌లో కుల్‌దీప్ 4 వికెట్లు తీసి టీం ఇండియాకు సులువుగా విజయం అందించాడు. అందుకే అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. అయితే, ఇంత అద్భుతంగా ఆడిన తర్వాత కూడా కుల్‌దీప్ తదుపరి మ్యాచ్‌లో, అంటే పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడడా? టీం ఇండియా అతన్ని జట్టు నుంచి తొలగిస్తుందని సమాచారం.

దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో యూఏఈ జట్టు కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయింది. కుల్‌దీప్ 2.1 ఓవర్లలో 7 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. అతని మొదటి ఓవర్లో వికెట్లు లభించలేదు, కానీ తర్వాత 7 బంతుల్లో 4 వికెట్లు తీశాడు. దీనితో యూఏఈ టాప్, మిడిల్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది. ఈ మ్యాచ్‌ను భారత్ కేవలం 4.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఈజీగా గెలిచింది.

మంజ్రేకర్ చేసిన ట్వీట్​లో అసలు విషయం అదేనా?

ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ప్రఖ్యాత కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఒక ట్వీట్ చేశాడు. అందులో.. “కుల్‌దీప్ ఒక ఓవర్‌లో 3 వికెట్లు తీశాడు. ఇప్పుడు బహుశా తర్వాతి మ్యాచ్ ఆడకపోవచ్చు” అని రాశాడు. కానీ, మంజ్రేకర్ ఎందుకలా రాశాడు? అతను ఏదైనా వ్యూహం గురించి చెబుతున్నాడా? లేదు. మంజ్రేకర్ తన ట్వీట్‌లో టీం ఇండియా మేనేజ్‌మెంట్‌ను ఎగతాళి చేశాడు.

అద్భుత ప్రదర్శన తర్వాత కూడా అవుట్​

అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత కూడా జట్టు నుంచి కుల్‌దీప్‌ను తొలగించడం అతని కెరీర్‌లో చాలాసార్లు జరిగింది. 2017లో టీం ఇండియాలోకి అడుగుపెట్టినప్పటి నుండి అతను చాలాసార్లు జట్టుకు దూరమయ్యాడు. కొన్నిసార్లు, అతను బాగా ఆడినప్పటికీ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి లేదా జట్టు నుంచి తొలగించబడ్డాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో అతని విషయంలో ఇది చాలాసార్లు జరిగింది. 2019లో ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా సిడ్నీ టెస్ట్‌లో 5 వికెట్లు తీసిన తర్వాత కూడా అతన్ని జట్టు నుంచి తొలగించారు. తర్వాత 2021లో కేవలం ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత మళ్లీ డిసెంబర్ 2022లో అతనికి అవకాశం లభించింది.

బంగ్లాదేశ్కు మీద ఒక టెస్ట్‌లో ఆడి, మళ్లీ 5 వికెట్లు తీసినా కూడా అతన్ని జట్టు నుంచి తప్పించారు. మళ్లీ 2024లో తిరిగి వచ్చాడు. గత సంవత్సరం టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలో అతనికి అవకాశం ఇవ్వలేదు, కానీ సూపర్-4లో అతను అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. అందుకే, కొన్నిసార్లు టీం ఇండియా మేనేజ్‌మెంట్‌కు కుల్‌దీప్ మంచి ప్రదర్శన తర్వాత కూడా ఎగతాళి తప్పదు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

వరుణ్ సందేశ్ వైఫ్ యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తుందంటే.?
వరుణ్ సందేశ్ వైఫ్ యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తుందంటే.?
ఒకప్పుడు చంద్రబాబు ప్రొటోకాల్ ఆఫీసర్.. ఇప్పుడు స్టార్ యాక్టర్
ఒకప్పుడు చంద్రబాబు ప్రొటోకాల్ ఆఫీసర్.. ఇప్పుడు స్టార్ యాక్టర్
సముద్రంలో అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.. అమేజింగ్ వీడియో
సముద్రంలో అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.. అమేజింగ్ వీడియో
10,000 అడుగుల మ్యాజిక్.. రోజూ నడిస్తే మీ శరీరంలో జరిగే అద్భుత..
10,000 అడుగుల మ్యాజిక్.. రోజూ నడిస్తే మీ శరీరంలో జరిగే అద్భుత..
సంక్రాంతి నాడు నువ్వుల లడ్డు ఎందుకు తింటారు? ప్రాముఖ్యత తెలుసా?
సంక్రాంతి నాడు నువ్వుల లడ్డు ఎందుకు తింటారు? ప్రాముఖ్యత తెలుసా?
పాము కాటేసిందనీ.. చొక్కా జేబులో వేసుకుని ఆస్పత్రికెళ్లాడు! వీడియో
పాము కాటేసిందనీ.. చొక్కా జేబులో వేసుకుని ఆస్పత్రికెళ్లాడు! వీడియో
చైనీస్ మాంజాను ఏలా రక్షించుకోవాలో తెలుసా?
చైనీస్ మాంజాను ఏలా రక్షించుకోవాలో తెలుసా?
పొట్ట ఐస్‌లా కరగాల్సిందే.. రోజూ సోంపును ఇలా తీసుకుంటే అద్భుతాలే..
పొట్ట ఐస్‌లా కరగాల్సిందే.. రోజూ సోంపును ఇలా తీసుకుంటే అద్భుతాలే..
టాస్ గెలిచిన కివీస్..బ్యాటింగ్‌కు దిగనున్న టీమిండియా
టాస్ గెలిచిన కివీస్..బ్యాటింగ్‌కు దిగనున్న టీమిండియా
అంత్యక్రియలు చేస్తుండగా.. ఊహించని షాక్..!
అంత్యక్రియలు చేస్తుండగా.. ఊహించని షాక్..!