ఐపీఎల్ 2023లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మ్యాచ్‌లో జరిగిన సంఘటనలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మొదట విరాట్ కోహ్లీ- నవీన్ ఉల్ హక్ గొడవ, ఆతర్వాత కోహ్లీ- గంభీర్ కొట్లాటతో అసలు ఐపీఎల్‌లో ఏం జరుగుతోందంటున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా విరాట్ వర్సెస్ కోహ్లీల గొడవపై క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు పలువురు క్రికెటర్లతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరూ ఢిల్లీకి చెందిన ఆటగాళ్లే .. ఆతర్వాత టీమిండియాలో చాలా ఏళ్లపాటు కలిసి ఆడారు. తమ ఇన్నింగ్స్‌లతో భారత జట్టుకు ఎన్నో మధురమైన విజయాలు అందించారు. అలాంటి ఆటగాళ్ల మధ్య ఇలా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఎందుకు మారిందో ఫ్యాన్స్ అర్థం కావడంలేదు. మొదటిసారిగా 2013లో ఐపీఎల్ సందర్భంగా కోల్‌కత్తా నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య మ్యాచ్‌లో గంభీర్– కోహ్లీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాటలతో మొదలై పరస్పరం కొట్టుకునే దాకా వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరూ కెప్టెన్లే. పైగా అగ్రెసివ్ ప్లేయర్సే. దీంతో వారిద్దరినీ ఆపడం సహచరులకు కూడా కష్టంగా మారింది. 2013 జరిగిన ఈ గొడవ అప్పట్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత అవకాశం వచ్చిన ప్రతిసారి గంభీర్ కోహ్లీని విమర్శిస్తూ వచ్చాడు. విరాట్ వైఫల్యాల్లో ఉన్నప్పుడు తన మనసు నొచ్చుకునేలా మాట్లాడాడు. అయితే కోహ్లీ మాత్రం గంభీర్ గురించి ఏనాడు పల్లెత్తు మాట అనలేదు. 2013 తర్వాత మళ్లీ సరిగ్గా పదేళ్లకు విరాట్- గంభీర్ తీవ్ర స్థాయిలో గొడవ పడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
విరాట్- గంభీర్ ల గొడవపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లే. యువ క్రికెటర్లకు ఎంతో ఆదర్శంగా ఉండాల్సిన వీరే ఇలా గొడవకు దిగడం సరికాదంటున్నారు ఫ్యాన్స్. ఈక్రమంలో వీరిద్దరి బాండింగ్‌కు సంబంధించి ఒక సంఘటనను గుర్తుచేస్తున్నారు. అదేంటంటే.. 2009లో భారత్-శ్రీలంక మధ్య వన్డే మ్యాచ్‌లో టీమిండియా 316 పరుగుల భారీ స్కోర్‌ను ఛేదించి విజయ పతాక ఎగరవేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, గంభీర్‌లు కీలక ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియాను గెలిపించారు. 316 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో సెహ్వాగ్ 10, సచిన్ 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన గంభీర్, ఆతర్వాత వచ్చిన కోహ్లీతో కలిసి అద్భుతంగా ఆడాడు. ఇద్దరూ 220 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.
You guys know who Gautam Gambhir is ?? He gave his MoM award to Virat Kohli on his first century in international cricket such a gold hearted person he is and some people’s are trolling him for his aggression. pic.twitter.com/if2E7lrfZ4
— RADHE ࿗?? (@Iamradhe_p00) May 1, 2023
గంభీర్ 137 బంతుల్లో 14 ఫోర్లతో 150 పరుగులు చేశాడు. అలాగే కోహ్లీ కూడా114 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో 107 రన్స్ చేశాడు. అయితే మ్యాచ్ తర్వాత తనకు వచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని గంభీర్.. కోహ్లీకి ఇవ్వాలని నిర్వాహకులను కోరాడు. వారు కూడా గంభీర విజ్ఞప్తిని మన్నించి ఆ అవార్డును కోహ్లీకి అందించారు. కోహ్లీ వన్డే కెరీర్‌లో అది మొదటి సెంచరీ కావడంతో గంభీర్ అలా చేశాడు. అలా ఇద్దరి మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉందనుకున్నారు. అయితే ఇప్పుడు గ్రౌండ్‌లోనే గొడవకు దిగడం అందరినీ షాక్ కు గురిచేసింది.
Everything after handshake here:
Virat Kohli vs Gautam GambhirBIGGEST RIVALRY IN CRICKET
Entertainment into 100#RCBVSLSG #ViratKohli pic.twitter.com/8SxxSKRByn
— aqqu who (@aq30__) May 1, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..