Video: 6,6,4,4,6.. ఇన్ని బౌండరీలు బాదిన వైభవ్ బ్యాట్ బరువెంతో తెలుసా?

Vaibhav Suryavanshi Bat Weight: కేవలం 14 సంవత్సరాల వయసులో, వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి, అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత అతను బ్యాటింగ్‌కు రాగానే, మొదటి బంతినే సిక్సర్‌గా మలిచాడు. వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించిన బ్యాట్ గురించి అతని కోచ్ కీలక విషయాలు చెప్పుకొచ్చాడు.

Video: 6,6,4,4,6.. ఇన్ని బౌండరీలు బాదిన వైభవ్ బ్యాట్ బరువెంతో తెలుసా?
Vaibhav Suryavanshi Bat Weight

Updated on: Apr 21, 2025 | 10:41 AM

Vaibhav Suryavanshi Bat Weight: ఐపీఎల్ 2025లో క్రికెట్ ప్రపంచానికి మరో యువ కెరటాన్ని అందించింది. అతని పేరు వైభవ్ సూర్యవంశీ. బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన ఈ 14 ఏళ్ల ఈ యువ క్రికెటర్.. ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్‌లో ఇంత చిన్న వయసులోనే అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. అతను అందరికంటే చిన్నవాడు మాత్రమే కాదు.. తొలి బంతికే సిక్స్ కొట్టి సంచలనం సృష్టించాడు. కానీ, వైభవ్ ఈ సిక్స్ కొట్టిన బ్యాట్ బరువు ఎంత? ఈ విషయాన్ని అతని కోచ్ మనీష్ ఓజా వెల్లడించారు.

మొదటి బంతికే సిక్స్..

కేవలం 14 సంవత్సరాల 23 రోజుల వయసులో, వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న వైభవ్.. ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్యాటింగ్ చేసే అవకాశం రాగానే, వైభవ్ ఇక్కడ కూడా ఆ అవకాశాన్ని వదులుకోలేదు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌పై వైభవ్ తన కెరీర్‌లోని తొలి బంతికే అద్భుతమైన సిక్స్ కొట్టాడు. ఈ షాట్ అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Video: ఇదేం బౌలింగ్ భయ్యా.. అర్థమయ్యేలోపే క్లీన్ బౌల్ట్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

కానీ, వైభవ్ ఇక్కడితో ఆగలేదు. తన మూడవ బంతికి అవేష్ ఖాన్‌ బౌలింగ్ సిక్స్ కొట్టాడు. ఇంత చిన్న వయసులోనే అద్భుతమైన ప్రారంభంతో, వైభవ్ అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఈ క్రమంలో అతని బ్యాట్ పేరు, దాని బరువు ఏమిటో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. టీవీ9 తో జరిగిన ప్రత్యేక సంభాషణలో వైభవ్ కోచ్ మనీష్ ఓజా ఈ విషయాన్ని వెల్లడించారు.

వైభవ్ బ్యాట్ బరువు ఎంత?

పాట్నాలోని జెనిత్ క్రికెట్ అకాడమీలో వైభవ్‌కు శిక్షణ ఇచ్చే కోచ్ మనీష్ మాట్లాడుతూ.. వైభవ్ ఉపయోగించే బ్యాట్ SS కంపెనీకి చెందినదని అన్నాడు. బరువు విషయానికి వస్తే, వైభవ్ 1150 గ్రాముల అంటే 1 కిలో 150 గ్రాముల బరువున్న బ్యాట్‌ను ఉపయోగిస్తాడని అతను చెప్పాడు. వైభవ్ అకాడమీలో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించినప్పుడు, అతను 1100 గ్రాముల బ్యాట్‌ను ఉపయోగించేవాడని, దానిని 1150 గ్రాములకు పెంచాడని కూడా ఆయన తెలిపాడు. అయితే, కొన్నిసార్లు మ్యాచ్‌ను బట్టి బ్యాట్ బరువును మారుస్తానని, కానీ తన బ్యాట్ సాధారణంగా 1150 గ్రాముల బరువు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి: ఒరేయ్, ఎవర్రా నువ్వు.. టీ20ల్లో చెత్త బ్యాటింగ్.. ఓపెనర్‌గా వచ్చి నాటౌట్‌గా నిలిచి.. ఎన్ని రన్స్ చేశాడో తెలుసా?

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..