
ఇంగ్లండ్‌తో జరిగే 5వ టెస్టు మ్యాచ్‌కు కూడా కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండడం లేదు . గాయం కారణంగా రాహుల్ ఇప్పటికే నాలుగు టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యాడు రాహుల్ .అయితే ఐదో మ్యాచ్ సందర్భంగా భారత జట్టులో చేరతాడని చెప్పుకొచ్చారు. కానీ ధర్మశాలలో మార్చి 7 నుంచి ప్రారంభమయ్యే చివరి టెస్టు మ్యాచ్‌కు కూడా రాహుల్ అందుబాటులో ఉండడని సమాచారం. నివేదికల ప్రకారం, KL రాహుల్ గాయం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, BCCI ఇప్పుడు తదుపరి చికిత్స కోసం అతన్ని లండన్‌కు పంపింది. రాహుల్ 90% ఫిట్‌గా ఉన్నప్పటికీ, అతను కొన్ని సమస్యలతో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తదుపరి చికిత్స నిమిత్తం విదేశాలకు పంపినట్లు సమాచారం. కెఎల్ రాహుల్ వచ్చే వారం లండన్‌లోని స్పెషలిస్ట్ డాక్టర్ ఆధ్వర్యంలో చికిత్స పొందనున్నారు. ఈ సందర్భంలో, అతని గాయం తీవ్రంగా ఉన్నట్లు గుర్తించినట్లయితే మరి కొన్ని రోజులు ఆటకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.ఒక వేళ కేఎల్ రాహుల్ గాయం తీవ్రంగా ఉంటే ఐపీఎల్ ప్రథమార్థంలో అతడు ఆడడం అనుమానమే. ఎందుకంటే మార్చి 22 నుంచి ఐపీఎల్ సీజన్-17 ప్రారంభం కానుంది. ఇంతలో, డాక్టర్ విశ్రాంతిని సూచిస్తే, అతను కొన్ని మ్యాచ్‌లకు దూరం కావాల్సి ఉంటుంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ఐపీఎల్ ప్రథమార్థంలో ఆడబోతున్నాడా లేదా అన్నది మార్చి మొదటి వారంలో తేలిపోనుంది.
ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది. ధర్మశాల హెచ్‌పీసీఏ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో టీమిండియా యువ ఆటగాళ్లకు స్థానం కల్పించాలనుకుంటోంది.. ఎందుకంటే టీమ్ ఇండియా ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది కాబట్టి రిజర్వ్ బెంచ్ సామర్థ్యం పరీక్షించుకోనుంది. కేఎల్ రాహుల్ స్థానంలో దేవదత్ పడిక్కల్ ఇప్పటికే టీమ్ ఇండియాలో ఉన్నాడు. తద్వారా చివరి టెస్టు మ్యాచ్ లో పడిక్కల్ కు అవకాశం దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే 3 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రజత్ పాటిదార్ పూర్తిగా విఫలమయ్యాడు. కాబట్టి అతనికి బదులుగా దేవదత్ పడిక్కల్‌ను ఐదో మ్యాచ్‌లో బరిలోకి దించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, దేవదత్ పడిక్కల్.
Kl Rahul has been sent London for the treatment of his injury. pic.twitter.com/lTXm82tXa0
— CricketGully (@thecricketgully) February 28, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..