ఐపీఎల్-2023 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రయాణం ముగిసింది. ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఒక పరుగు తేడాతో ఓటమిపాలైంది. అయితే సీజన్ ఆరంభం నుంచి కోల్‌కతా జట్టుకు వెన్నెముకలా నిలుస్తోన్న రింకూసింగ్ ఆఖరి మ్యాచ్‌లోనూ అద్భుతంగా ఆడాడు. లక్నో బౌలర్లను ఉతికారేస్తూ కేకేఆర్‌ను దాదాపు గెలిపించినంత పనిచేశాడు. ఈ మ్యాచ్‌లో 33 బంతులు ఎదుర్కొన్న రింకూసింగ్ 67 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీని కవ్వించి వార్తల్లో నిలిచిన నవీన్ ఉల్ హక్ కు చుక్కలు చూపించాడు రింకూ. కోల్‌కతా బ్యాటర్ ధాటికి 4 ఓవర్లలోనే 46 పరుగులు సమర్పించుకున్నాడీ ఆఫ్గాన్ బౌలర్. ఇక అతను వేసిన 19 ఓవర్‌లో రెచ్చిపోయాడు యంగ్ బ్యాటర్. ఈ ఓవర్‌లో 3 ఫోర్లు, ఒక భారీ సిక్సర్ బాదిన రింకూ ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు. ముఖ్యంగా ఇదే ఓవర్ లో రింకూ బాదిన 110 మీటర్ల సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోల్‌కతా మ్యాచ్ ఓడిపోయినా.. తన ధనాధన్ ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసును గెల్చుకున్నాడు రింకూసింగ్.
కాగా ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన రింకూ సింగ్ 149 స్ట్రైక్‌రేట్‌తో 374 పరుగులు చేయడం విశేషం. అతని ఖాతాలో నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. రింకూ బ్యాటింగ్‌ను చూస్తుంటే టీమిండియాకు మంచి ఫినిషర్ దొరికాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. త్వరలోనే రింకూను టీమిండియాలో చూడాలనుకుంటున్నామంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో రింకూసింగ్ మెరుపు ఇన్నింగ్స్ చూసి లక్నో మెంటర్ గౌతమ్ గంభీర్ కూడా ముగ్ధుడయ్యాడు. మ్యాచ్ అనంతరం అతనిని ప్రత్యేకంగా అభినందించారు.
Rinku Singh hain inka naam?, namumkin nahin inke liye koi kaam ? #KKRvLSG #IPLonJioCinema #TATAIPL #EveryGameMatters | @KKRiders pic.twitter.com/2YbgkciPW5
— JioCinema (@JioCinema) May 20, 2023
Eden Gardens chanting Rinku Rinku. Till the last ball, everyone believed in him. KKR is extremely lucky to have this gem. The story of this IPL is surely LORD RINKU SINGH ?? pic.twitter.com/brRkbWUdJS
— sohom | kkr era (@AwaaraHoon) May 20, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..