KKR vs GT Match Highlights, IPL 2022: పోరాడి ఓడిన కోల్‌కతా.. 8 పరుగుల తేడాతో గుజరాత్‌ ఘన విజయం..

|

Apr 23, 2022 | 7:37 PM

Kolkata Knight Riders vs Gujarat Titans Highlights in Telugu: గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఓటమి పాలైంది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో పరాజయం పాలైంది..

KKR vs GT Match Highlights, IPL 2022: పోరాడి ఓడిన కోల్‌కతా.. 8 పరుగుల తేడాతో గుజరాత్‌ ఘన విజయం..
Kkr Vs Gt

Kolkata Knight Riders vs Gujarat Titans Highlights in Telugu: గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఓటమి పాలైంది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కోల్‌కతా బౌలర్స్‌ కట్టడి చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. దీంతో గుజరాత్‌ తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పటికే వరుసగా రెండు విజయాలు అందుకున్న గుజరాత్‌ ఇప్పుడు హ్యాట్రిక్‌ విజయాన్ని సాధఙంచింది. కోల్‌కతా మాత్రం వరుసగా మూడు పరాజయాలను మూటగట్టుకుంది. గుజరాత్‌ బౌలర్స్‌లో షమీ, దయాల్‌, రషీద్‌ ఖాన్‌ చేరో రెండు వికెట్లు తీసుకోగా.. జోసఫ్‌, లాకీ ఫెర్గూసన్ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

ఇక అంతకు ముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 156 పరుగులు మాత్రమే చేసింది. చివరి నాలుగు ఓవర్లలోనే ఏకంగా 7 వికెట్లు కోల్పోవడంతో గుజరాత్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. హార్ధిక్‌ పాండ్యే (67) జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేసినా, అతను అవుట్ అయ్యాక జట్టు స్కోరుకు ముందుకు సాగలేదు.

క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్‌ వచ్చినట్లు పెవిలియన్‌ బాట పట్టాడు. ఇక కోల్‌కతా బౌలర్స్‌ చెలరేగి పోయారు. ఆండ్రీ రస్సెల్‌ కేవలం ఒకే ఓవర్‌ వేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. టిమ్‌ సౌథీ 4 ఓవర్లు వేసి కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. దీంతో గుజరాత్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. అయితే గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విజయం వరించింది.

Key Events

బలంగా గుజరాత్‌..

హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో రాణిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన చివరి గాయం కారణంగా హార్దిక్ మ్యాచ్‌కు దూరమైనా గుజరాత్‌ విజయాన్ని నమోదు చేసుకోవడం విశేషం.

కోల్‌కతా వీక్‌ పాయింట్స్‌ ఇవే..

వరుసగా మూడు పరాజయాలు ఎదుర్కొన్న కోల్‌కతా ఢీలా పడింది. ప్లేయర్స్‌ ఫామ్‌లో లేకపోవడం కోల్‌కతాకు కాస్త ఇబ్బందిగా మరే అవకాశం కనిపిస్తోంది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 23 Apr 2022 07:34 PM (IST)

    మరో ఓటమి మూటగట్టుకున్న కోల్‌కతా..

    గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఓటమి పాలైంది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కోల్‌కతా బౌలర్స్‌ కట్టడి చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. దీంతో గుజరాత్‌ తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పటికే వరుసగా రెండు విజయాలు అందుకున్న గుజరాత్‌ ఇప్పుడు హ్యాట్రిక్‌ విజయాన్ని సాధఙంచింది. కోల్‌కతా మాత్రం వరుసగా మూడు పరాజయాలను మూటగట్టుకుంది. గుజరాత్‌ బౌలర్స్‌లో షమీ, దయాల్‌, రషీద్‌ ఖాన్‌ చేరో రెండు వికెట్లు తీసుకోగా.. జోసఫ్‌, లాకీ ఫెర్గూసన్ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

  • 23 Apr 2022 06:43 PM (IST)

    మరో వికెట్ డౌన్‌..

    కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మరో వికెట్‌ కోల్పోయింది. కాస్త పరుగులు చేస్తూ జట్టు స్కోరును పెంచుతున్నాడని అనుకుంటున్న సమయంలో రింకు సింగ్‌ అవుట్‌ అయ్యాడు. యశ్‌ దయాల్‌ బౌలింగ్‌లో సాహకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.


  • 23 Apr 2022 06:32 PM (IST)

    నెమ్మదించిన కోల్‌కతా స్కోర్‌ బోర్డ్‌..

    గుజరాత్ బౌలర్లు ధీటుగా బౌలింగ్ చేస్తుండడంతో కోల్‌కతా స్కోర్‌ నెమ్మదిస్తోంది. 10 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 64 పరుగులు మాత్రమే చేసింది. గుజరాత్‌ విజయం సాధించాలంటే 59 బంతుల్లో 93 పరుగులు చేయాల్సి ఉంది.

  • 23 Apr 2022 05:50 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కతా..

    కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మరో వికెట్‌ కోల్పోయింది. ఆశలు పెట్టుకున్న సునీల్‌ నరైన్‌ కూడా స్వల్ప పరుగుకే వెనుదిరిగాడు. దీంతో కోల్‌కతా ఒక్కసారిగా కష్టాల్లోకి కూరుకుంది. 5 పరుగుల చేసిన సునీల్‌ నరైన్‌ షమీ బౌలింగ్‌లో లాకీ ఫెర్గూసన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 23 Apr 2022 05:41 PM (IST)

    అప్పుడే తొలి వికెట్‌..

    గుజరాత్‌ ఇచ్చిన 157 పరగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్‌లోనే సామ్‌ బిల్లింగ్స్‌ అవుట్‌ అయ్యాడు. షమీ బౌలింగ్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు.

  • 23 Apr 2022 05:24 PM (IST)

    ముగిసిన గుజరాత్‌ ఇన్నింగ్స్‌..

    టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 156 పరుగులు మాత్రమే చేసింది. చివరి నాలుగు ఓవర్లలోనే ఏకంగా 7 వికెట్లు కోల్పోవడంతో గుజరాత్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. హార్ధిక్‌ పాండ్యే (67) జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేసినా, అతను అవుట్ అయ్యాక జట్టు స్కోరుకు ముందుకు సాగలేదు. క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్‌ వచ్చినట్లు పెవిలియన్‌ బాట పట్టాడు. ఇక కోల్‌కతా బౌలర్స్‌ చెలరేగి పోయారు. ఆండ్రీ రస్సెల్‌ కేవలం ఒకే ఓవర్‌ వేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. టిమ్‌ సౌథీ 4 ఓవర్లు వేసి కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. దీంతో గుజరాత్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది.

  • 23 Apr 2022 05:17 PM (IST)

    వరుస వికెట్లు కోల్పోతున్న గుజరాత్‌..

    గుజరాత్‌ టైటాన్స్‌ తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేలా ఉంది. చివరి బంతుల్లో వరుస వికెట్లు పడుతుండడంతో జట్టు స్కోర్ వేగం నెమ్మదించింది. లాకీ ఫెర్గూసన్ ఖాతా తెరవకముందే వెనుదిరిగాడు.

  • 23 Apr 2022 05:07 PM (IST)

    వెంటవెంటనే వికెట్లు కోల్పోతున్న గుజరాత్‌..

    గుజరాత్‌ టైటాన్స్‌ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. స్కోరు బోర్డ్‌ను పెంచుతోన్న హార్ధిక్‌ పాండ్యా అవుట్‌ అయిన కాసేపటికే రషీద్‌ ఖాన్‌ ఉమెష్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ప్రస్తుతం 18 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్‌ 140 పరుగులు చేసింది.

  • 23 Apr 2022 04:41 PM (IST)

    హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పాండ్యా..

    వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన గుజరాత్‌ స్కోర్‌ బోర్డ్‌ పెంచే పనిలో పడ్డాడు కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 40 బంతుల్లో 55 పరుగులతో దూకుడుగా ఆడుతున్నాడు. ఇక 14 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్‌ 114 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 23 Apr 2022 04:27 PM (IST)

    రెండో వికెట్‌ డౌన్‌..

    గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఉమేష్‌ యాదవ్‌ బౌలింగ్‌లో వెంకటేష్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చిన వృద్ధిమాన్ సాహా పెవిలియన్‌ బాట పట్టాడు. ప్రస్తుతం గుజరాత్‌ స్కోర్‌ 11 ఓవర్లు ముగిసే సమయానికి 86 పరగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో మిల్లర్‌ (1), పాండ్యా (49) పరుగుల వద్ద కొనసాగుతున్నాడు.

  • 23 Apr 2022 03:40 PM (IST)

    గుజరాత్‌కు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ..

    గుజరాత్‌కు ప్రారంభంలోని షాక్‌ ఎదురైంది. జట్టుకు భారీ స్కోర్‌ అందిస్తాడని భావించిన శుభ్‌మన్‌ గిల్‌ తక్కువ పరుగులకే పెవిలియన్‌ బాట పట్టాడు. 7 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద టిమ్‌ సౌథీ బౌలింగ్‌లో బిల్లింగ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 23 Apr 2022 03:09 PM (IST)

    టాస్‌ గెలిచిన గుజరాత్‌..

    టాస్‌ గెలిచిన గుజరాత్‌ తొలుత బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపింది. ఇప్పటికే వరుసగా రెండు విజయాలను నమోదు చేసుకున్న గుజరాత్‌ మరో విజయాన్ని నమోదు చేసుకొని హ్యాట్రిక్‌ అందుకునేందుకు సిద్ధమైంది. మరి తొలుత బ్యాటింగ్‌ చేయాలనుకుంటున్న గుజరాత్‌ వ్యూహం ఏమేర ఫలిస్తుందో చూడాలి.

Follow us on