20 ఓవర్ల మ్యాచ్.. ఈజీ టార్గెట్.. ఫలితాన్ని తేల్చేసిన సూపర్ ఓవర్.. అయినా తప్పని ఓటమి!

| Edited By: Anil kumar poka

Sep 04, 2021 | 8:32 PM

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో తాజాగా జరిగిన ఓ మ్యాచ్ సినిమాలో సస్పెన్స్ మాదిరి అభిమానులకు కావల్సినంత మజాను ఇచ్చింది. టైగా ముగిసిన..

20 ఓవర్ల మ్యాచ్.. ఈజీ టార్గెట్.. ఫలితాన్ని తేల్చేసిన సూపర్ ఓవర్.. అయినా తప్పని ఓటమి!
Cpl 2021
Follow us on

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో తాజాగా జరిగిన ఓ మ్యాచ్ సినిమాలో సస్పెన్స్ మాదిరి అభిమానులకు కావల్సినంత మజాను ఇచ్చింది. టైగా ముగిసిన ఈ మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్‌లో తేలింది. ట్రినిబాగో నైట్ రైడర్స్, గయానా అమెజాన్ వారియర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో పొలార్డ్ సేన ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రినిబాగో నైట్ రైడర్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఇక లక్ష్యచేధనలో భాగంగా అమెజాన్ వారియర్స్ నిర్ణీత ఓవర్లకు సేమ్ స్కోర్ చేయగలిగింది. మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్‌కు మారింది. సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అమెజాన్ వారియర్స్.. నైట్ రైడర్స్‌కు ఆరు పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. క్రీజులోకి విధ్వంసకర బ్యాట్స్‌మెన్లు వచ్చారు. అయితే ఓటమిపాలయ్యారు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి.. పరాజయాన్ని ఎదుర్కున్నారు. అమెజాన్ వారియర్స్ బౌలర్ షెఫార్డ్ నాలుగు ఓవర్లలో కేవలం 24 పరుగులకే మూడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

విఫలమైన పొలార్డ్..

ఈ మ్యాచ్‌లో నైట్ రైడర్స్ కెప్టెన్ పూర్తిగా విఫలమయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. కోలిన్ మున్రో(32) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ పొలార్డ్(13) ఆకట్టుకోదగిన ప్రదర్శన ఇవ్వలేదు. అలాగే సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగి మొదటి బంతికి పెవిలియన్ చేరాడు.

Read Also: ఒక్క వికెట్‌ కోసం తండ్లాట..! బ్యాట్స్‌మెన్‌ను చుట్టుముట్టిన ఫీల్డర్లు.. చివరికి గెలిచిందెవరు..?

హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం.. ఈ పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..