
Anirudh Ravichander Net Worth: ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపునకు వచ్చేసరికి మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటతీరుతో పాటు, ఆ జట్టు యజమాని కావ్య మారన్ వ్యక్తిగత జీవితంపై కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో ఆమె పెళ్లి పీటలెక్కబోతోందని, స్పెయిన్‌లో వివాహం, చెన్నైలో ఘనంగా విందు ఏర్పాటు చేయనున్నారని నెట్టింట కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, గతంలో ఇలాంటి పుకార్లపై అనిరుధ్ స్పందిస్తూ “పెళ్లా? నవ్వకండి బాబోయ్.. దయచేసి పుకార్లను నమ్మకండి” అని కొట్టిపారేశారు. తాజాగా మళ్లీ ఈ వార్తలు తెరపైకి రావడంతో, వీరిద్దరి ఆర్థిక బలాబలాలు, ఆస్తుల పోలికపై అభిమానులు ఆరా తీస్తున్నారు.
సన్ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ ఏకైక కుమార్తె అయిన కావ్య మారన్, వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సీఈఓగా వ్యవహరిస్తూ, ఫ్రాంచైజీ విలువను మూడు వేల కోట్ల రూపాయల పైచిలుకు చేర్చారు.
ఇది కూడా చదవండి: Video: తూచ్.. వాడిదసలు బౌలింగేనా.. స్టాండ్స్‌లో శివాలెత్తిన కావ్యపాప..
సన్ టీవీ నెట్‌వర్క్ బోర్డులో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కావ్య మారన్ వ్యక్తిగత ఆస్తుల విలువ సుమారు రూ. 400 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కేవలం సన్ గ్రూప్ నుంచి ఆమె అందుకునే వార్షిక వేతనం, డివిడెండ్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీ వాటాల ద్వారా ఈ సంపాదన వస్తోంది. ఇక ఆమె కుటుంబ మొత్తం ఆస్తి విలువ దాదాపు రూ. 19,000 కోట్ల పైమాటే. చెన్నైలో రూ. 100 కోట్ల విలువైన విలాసవంతమైన భవనంతో పాటు రేంజ్ రోవర్, మెర్సిడెస్ జీ-వాగన్ వంటి ఖరీదైన కార్లు ఆమె సొంతం.
మరోవైపు, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ రికార్డు సృష్టిస్తున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాలకు సంగీతాన్ని అందిస్తూ బ్లాక్‌బస్టర్ హిట్లు ఇస్తున్నారు. ఇటీవల ఒక సినిమాకు ఏకంగా రూ. 25 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అనిరుధ్ వ్యక్తిగత ఆస్తుల విలువ దాదాపు రూ. 50 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. సినిమాలు, భారీ లైవ్ కాన్సర్ట్‌లు, యూట్యూబ్, ఆడియో స్ట్రీమింగ్ రాయల్టీలు, అలాగే ప్రముఖ బ్రాండ్‌ల ప్రకటనల ద్వారా ఆయనకు భారీగా ఆదాయం సమకూరుతోంది. పారితోషికం పరంగా దేశంలోనే టాప్ లీగ్‌లో ఉన్నప్పటికీ, కావ్య మారన్ ఉన్నతమైన కార్పొరేట్ నేపథ్యం, వ్యాపార సామ్రాజ్యంతో పోలిస్తే అనిరుధ్ ఆస్తి విలువ తక్కువగానే కనిపిస్తుంది.
కావ్య మారన్, అనిరుధ్ ఇద్దరూ తమ తమ రంగాలలో తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నవారే. వీరి పెళ్లి వార్తలపై ఇప్పటివరకు ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, కేవలం సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల ఆధారంగానే ఈ ఆస్తుల పోలిక నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..