Video: కావ్యపాప ‘త్రీ ఫింగర్’ సెలబ్రేషన్స్ అదుర్స్.. ఆ సిగ్నల్ వెనుక అసలు మ్యాటర్ ఇంతుందా..?

Kavya Maran Ecstatic Celebrations Viral Video in SA20:కేప్‌టౌన్‌లో జరిగిన ఎస్ఏ20 లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌పై అద్భుత విజంయ సాధించిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ ఏకంగా మూడవసారి టైటిల్‌ను దక్కించుకుంది. ఈక్రమంలో కావ్యపాప సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Video: కావ్యపాప త్రీ ఫింగర్ సెలబ్రేషన్స్ అదుర్స్.. ఆ సిగ్నల్ వెనుక అసలు మ్యాటర్ ఇంతుందా..?
Kavya Maran Unmissable Celebration Video

Updated on: Jan 26, 2026 | 6:35 PM

Kavya Maran: ఎస్‌ఏ20 (SA20) 2025-26 ఎడిషన్ ఆదివారం ముగిసిన సంగతి తెలిసిందే. కేప్ టౌన్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ జట్టు విజయం సాధించి, ఎస్‌ఏ20 హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీంగా నిలిచింది. అంటే, ఇప్పటి వరకు జరిగిన నాలుగు సీజన్లలో సన్‌రైజర్స్ ఈస్టర్న్ జట్టు మూడవసారి ట్రోఫీని దక్కించుకుంది. 159 పరుగుల టార్గెట్‌ను ఛేదించిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ జట్టు ఆదిలో ఇబ్బందులు ఎదుర్కొంది. 8.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. ఈక్రమంలో ట్రిస్టన్ స్టబ్స్ (63*), మాథ్యూ బ్రీట్జ్కే (68*) తుఫాన్ హాఫ్ సెంచరీలతో చెలరేగి మూడవసారి విజేతగా నిలిపారు. ఈ క్రమంలో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజేతగా మార్చారు.

భారీ సిక్సర్లతో చెలరేగిన స్టబ్స్..

అయితే, చివరి ఓవర్లో సన్‌రైజర్స్‌ విజయానికి 9 పరుగులు అవసరం కాగా, స్టబ్స్ బ్రైస్ పార్సన్స్ బౌలింగ్‌లో 2 భారీ సిక్సర్లు కొట్టి విజయాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ సహ యజమాని కావ్య మారన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి

IND vs NZ: టీమిండియాకు బిగ్ షాక్.. మిగిలిన 3 మ్యాచ్‌ల నుంచి తెలుగబ్బాయ్ ఔట్.. ఎవరొచ్చారంటే?

కావ్యపాప ఫింగర్ సెలబ్రేషన్స్..

ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఈ వీడియోలో కావ్యపాప తన సీటు నుంచి లేచి, సన్‌రైజర్స్ చారిత్రాత్మక విజయంతోపాటు 3వసారి టైటిల్ దక్కించుకుందంటూ చేతితో మూడు వేళ్లను చూపిస్తూ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ వీడియోపై ఫ్యాన్స్ కూడా తమదైన శైలిలో కామెంట్స్ పంచుకుంటున్నారు. కావ్యపాప ఇలాగే నవ్వుతూ ఉండాలని, వచ్చే ఐపీఎల్ 2026లోనూ హైదరాబాద్ జట్టు మరో ట్రోఫీ దక్కించుకోవాలంటూ కోరుకుంటున్నారు.

IND vs PAK: కిల్ బిల్ పాండేను మించిన ఓవర్ యాక్షన్.. భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తామంటూ పాక్..

డేవాల్డ్ బ్రెవిస్ ఇన్నింగ్స్ వృథా..

సన్‌రైజర్స్ కెప్టెన్ ట్రిస్టన్ స్టబ్స్ (41 బంతుల్లో 63 నాటౌట్), మాథ్యూ బ్రీట్జ్‌కే (49 బంతుల్లో 68 నాటౌట్) ఐదవ వికెట్‌కు 114 పరుగుల అజేయ భాగస్వామ్యంతో ఆకట్టుకున్నారు. అంతకుముందు డెవాల్డ్ బ్రెవిస్ (56 బంతుల్లో 101) కీలక ఇన్నింగ్స్‌తో ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు 7 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..